News August 21, 2025
అంగన్వాడీలకు మంత్రి సీతక్క GOOD NEWS

రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ చిన్నారులకు రాష్ట్ర మహిళ సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే అంగన్వాడీలలో అల్పాహార పథకం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద HYDలోని 139 కేంద్రాల్లో దీన్ని అమలు చేయగా 30శాతం హాజరు పెరిగిందని మంత్రి అన్నారు. ప్రతిచిన్నారికి ఉదయం 100 మిల్లిలీటర్ల పాలు అందించాలన్నారు. వారంలో కనీసం ఒకరోజు ఎగ్ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ పెట్టాలన్నారు.
Similar News
News March 12, 2026
కొండమల్లేపల్లిలో 60 సిలిండర్లు సీజ్

కొండమల్లేపల్లిలో పౌర సరఫరాల శాఖ అధికారులు హోటల్, రెస్టారెంట్, దాబాలపై గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. అక్రమంగా వినియోగిస్తున్న 60 సిలిండర్లను సీజ్ చేసి పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ముబీన్, దీపక్, సైదులు, ముక్తర్, జ్యోతి, కుమార్ పాల్గొన్నారు.
News March 12, 2026
జిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదు: జేసీ

జిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని, గృహ అవసరాలకు గ్యాస్ సరఫరా సాధారణంగా కొనసాగుతోందని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ గురువారం తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న గ్యాస్ కొరత వార్తలు అవాస్తవమన్నారు. గ్యాస్ బుకింగ్‌కు 25 రోజుల గడువు మాత్రమే ఉంటుందని, అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు అపోహలు నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు.
News March 12, 2026
GWL: పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163.. ఎస్పీ శ్రీనివాసరావు

ఈనెల13 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలులో ఉంటుందని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుమి గూడాటాన్ని నిషేధించామన్నారు. ప్రతిరోజు ఉదయం 7:00 నుంచి మధ్యాహ్నం 3:00 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలన్నారు.


