News August 21, 2025

గాదిగూడ: రచయిత పోటీలకు ఎంపికైన ఆదివాసీ బిడ్డ

image

గాదిగూడకి చెందిన పెందోర్ దీపాలక్ష్మి ఈనెల 15న ‘నేషనల్ లెవల్ పుస్తక రచయిత’ పోటీలకు ఎంపికైంది. బెంగళూరులో జరుగుతున్న 5 రోజుల పోటీలకు ఆమె నిన్న హాజరైంది. రాష్ట్రం నుంచి దీపాలక్ష్మి ఎంపికై వివిధ రాష్ట్రాల రచయితలతో ఆమె పోటీచేయడం హర్షణీయమని పలువురు ఆమెను అభినందించారు. త్వరలో ఆదివాసీ చరిత్ర, ఆదివాసుల యొక్క జీవన విధానం అనే పుస్తకాలను రచించనున్నట్లు దీపాలక్ష్మి పేర్కొన్నారు.

Similar News

News March 14, 2026

మంగళగిరిలో ఆహార భద్రత శాఖ పనితీరుపై మంత్రి సమీక్ష

image

కుంచనపల్లిలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కార్యాలయంలో ఆహార భద్రత శాఖ పనితీరుపై మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం ఆహార భద్రత సూచీలో దేశంలో తొలి 10 స్థానాల్లో నిలవాలని లక్ష్యంగా పెట్టాలని అధికారులకు సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరిస్తూ ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి చేయాలన్నారు. బాగా పనిచేసేవారిని ప్రోత్సహించి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించేవారిపై చర్యలు ఉంటాయన్నారు.

News March 14, 2026

ఇరాన్ అగ్రనేతల సమాచారమిస్తే ₹92Cr రివార్డు

image

ఇరాన్ టాప్ లీడర్ల గురించి సమాచారం ఇచ్చిన వారికి $10m (₹92.5కోట్ల) వరకూ రివార్డు ఇస్తామని యూఎస్ ప్రకటించింది. రక్షణ కూడా కల్పిస్తామని హామీ ఇచ్చింది. US ప్రకటించిన లిస్టులో సుప్రీం లీడర్ మొజ్తబా సహా మరో 9 మంది పేర్లు ఉన్నాయి. మరోవైపు US మిలిటరీకి సంబంధించిన సమాచారమిస్తే 150 మిలియన్ ఇరాకీ దినార్లు (₹కోటి) రివార్డుగా ఇస్తామని ఇరాన్ మద్దతు సంస్థ ‘ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్’ ప్రకటించింది.

News March 14, 2026

శివంపేట: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు గాయాలు

image

శివంపేట మండలం ఉసిరికపల్లి గ్రామ శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. పంబ గ్రామానికి చెందిన కమ్మరి నాగరాజు భర్యతో కలిసి బైక్ వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆయన భార్య అంజమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.