News August 21, 2025
SRPT: ముదస్తుగానే వైన్స్ టెండర్లు..!

కొత్త వైన్స్‌కు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తోంది. ప్రస్తుత దుఖానాల లైసెన్స్ కాలపరిమితి ఈ ఏడాది NOV 30తో ముగియనున్న నేపథ్యంలో ముందస్తుగా 2025 మద్యం టెండర్ విధానాన్ని ప్రకటించింది. 2025 DEC 1 నుంచి 2027 NOV 30 వరకు కాలపరిమితికి టెండర్ ఫీజు ఖరారు చేసింది. మద్యం టెండర్ ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. ఒక్కరు ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 99 వైన్స్‌లు ఉన్నాయి.
Similar News
News March 21, 2026
మార్కాపురం జిల్లా తొలి కలెక్టర్‌గా విజయ సునీత

మార్కాపురం జిల్లా తొలి నూతన కలెక్టర్‌గా ఎం.విజయ సునీతను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. విజయ సునీత ప్రస్తుతం మార్కెటింగ్ వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. డిసెంబర్ 30న ఏర్పాటు చేసిన నూతన మార్కాపురం జిల్లాకు తొలి కలెక్టర్‌గా 2014 బ్యాచ్‌కి చెందిన మహిళా ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించింది.
News March 21, 2026
YELLOW ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు!

TG: రాష్ట్రంలో 2 రోజులు అక్కడక్కడా మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు రోజులు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా ఉండే ఛాన్స్ ఉందంది. ఆ తర్వాత 3 రోజుల్లో క్రమంగా 3 డిగ్రీల మేర పెరుగుతాయని పేర్కొంది.
News March 21, 2026
కెనాల్ పనుల పురోగతిపై మంత్రి ఉత్తమ్ సమీక్ష

SLBC, డిండి ఎత్తిపోతల, అచ్చంపేట కెనాల్ పనుల పురోగతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఎస్ఎల్‌బీసీ ఇన్‌లెట్ తవ్వకాల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయని, ఇప్పటికే దేవరకొండ నుంచి ఔట్‌లెట్ పనులు మొదలైనట్లు స్పష్టం చేశారు. టన్నెల్‌లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. సొరంగంలో గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలని, ఆధునిక టెక్నాలజీతో తవ్వకాలు జరపాలని సూచించారు.


