News August 21, 2025
యాదాద్రి: ముదస్తుగానే వైన్స్ టెండర్లు..!

కొత్త వైన్స్‌కు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తోంది. ప్రస్తుత దుకాణాల లైసెన్స్ కాలపరిమితి ఈ ఏడాది NOV 30తో ముగియనున్న నేపథ్యంలో ముందస్తుగా 2025 మద్యం టెండర్ విధానాన్ని ప్రకటించింది. 2025 DEC 1 నుంచి 2027 NOV 30 వరకు కాలపరిమితికి టెండర్ ఫీజు ఖరారు చేసింది. మద్యం టెండర్ ఫీజును రూ.2లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. ఒక్కరు ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు. యాదాద్రి జిల్లా వ్యాప్తంగా 82 వైన్స్‌లు ఉన్నాయి.
Similar News
News March 22, 2026
సొంత భూమికి సొమ్ము దక్కకనే వృద్ధుడి ఆత్మహత్య: ఎస్ఐ

భూమి అమ్మిన డబ్బులు ఇవ్వకుండా కొనుగోలుదారులు బెదిరింపులకు పాల్పడటంతో మనస్తాపం చెందిన <<19446112>>వృద్ధుడు<<>> ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎర్రుపాలెం SI రమేష్ తెలిపారు. బనిగండ్లపాడుకు చెందిన యన్నం వెంకటరామిరెడ్డి(70) తనకు ఉన్న 3గుంటల ఖాళీ స్థలాన్ని ముగ్గురికి విక్రయించారు. వారు కొంత నగదు చెల్లించి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మిగిలిన డబ్బుల కోసం వారిని అడగగా, భయభ్రాంతులకు గురిచేశారని ఎస్ఐ అన్నారు.
News March 22, 2026
రేపు విశాఖ రానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 23న విశాఖ రానున్నారు. 23న మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని అక్కడి నుంచి నక్కపల్లి మండలం చందనాడ గ్రామానికి వెళ్తారు. చందనాడలో జరిగే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు విశాఖ నుంచి విజయవాడ బయలుదేరి వెళ్తారు.
News March 22, 2026
రొటీన్‌కు భిన్నంగా రేవంత్ ప్రసంగం

నర్మెట్ట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన శైలికి భిన్నంగా రాజకీయ విమర్శల కంటే అభివృద్ధికే పెద్దపీట వేశారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకు నిధులు కేటాయిస్తున్నామని చెప్తూ ప్రతిపక్ష నేతల(కేసీఆర్, KTR, హరీశ్)పై వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉన్నారు. తన పాలనలో కక్షసాధింపు చర్యలు ఉండవని, ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ ప్రసంగం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.


