News August 21, 2025

గండికోట: లై డిటెక్టర్ టెస్ట్‌కు బాలిక కుటుంబసభ్యులు?

image

జూలై 14న గండికోటలో బాలిక హత్య కేసు మిస్టరీగా మారింది. డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ అశోక్ కుమార్ పర్యవేక్షణలో కేసు విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే బాలిక తల్లిదండ్రులతో పాటు దాదాపు 400 మందిని విచారించారు. కాగా ఈ నెల 26న లై డిటెక్టర్ టెస్ట్‌ కోసం జమ్మలమడుగు కోర్టుకు రావాలని బుధవారం సాయంత్రం బాలిక కుటుంబసభ్యులకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.

Similar News

News March 5, 2026

బీజేపీకి ₹6,769 కోట్ల ఆదాయం

image

2024-25లో BJPకి ₹6,769 కోట్ల ఆదాయం వచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్(ADR) తెలిపింది. 6 జాతీయ పార్టీలకు ₹7,960 కోట్లు రాగా, ఇందులో 85% బీజేపీకే వచ్చినట్లు చెప్పింది. కాంగ్రెస్‌కు ₹918 కోట్లు, CPMకు ₹172 కోట్లు, BSPకి ₹58.5 కోట్లు, AAPకు ₹39 కోట్లు వచ్చాయని వెల్లడించింది. తన ఆదాయంలో BJP ₹3,774 కోట్లు(55.76%), కాంగ్రెస్ 1,111.94 కోట్లు(అదనంగా ₹193.66cr) ఖర్చు చేసినట్లు చెప్పింది.

News March 5, 2026

NRPT: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై అవగాహన

image

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 90 రోజుల కార్యక్రమం నిర్వహణపై గురువారం నారాయణపేటలోని నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో జిల్లాలోని విధులు, ఆశాలు, సూపర్‌వైజర్‌లకు అవగాహన కల్పించినట్లు DMHO జయ చంద్రమోహన్ తెలిపారు. మెటర్నల్ హెల్త్, చైల్డ్ ఇమ్యూనైజేషన్, ఎన్సీడీ తదితర కార్యక్రమాల నిర్వహణపై అవగాహన కల్పించారు. వైద్య శాఖ సూచించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.

News March 5, 2026

ఖమ్మం: 414 మంది విద్యార్థులు గైర్హాజరు

image

ఖమ్మం జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ గణితం, జువాలజీ, హిస్టరీ పరీక్షకు 16,663 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు తెలిపారు. జనరల్ కోర్సుల్లో 14,801 మందికి గాను 14,526 మంది, అటు ఒకేషనల్ కోర్సుల్లో 2,276 మందికి గాను 2,137 మంది హాజరయ్యారని, మొత్తంగా 414 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. అటు ఇవాళ ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.