News August 21, 2025
ఓరుగల్లులో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈనెల 25, 26 తేదీల్లో వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు 25న నేరుగా వర్ధన్నపేట మండలంలోని ఉప్పరపల్లిలో పాదయాత్రను ప్రారంభించి వర్ధన్నపేట వరకు 6 కిలోమీటర్లు నిర్వహిస్తారు. అనంతరం అక్కడే బసచేస్తారు. 26న వర్ధన్నపేటలో శ్రమదానం నిర్వహించి, ఐనవోలు దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి తిరిగి హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ సభ ఉంటుంది.
Similar News
News March 11, 2026
HEADLINES

* గల్ఫ్ యుద్ధంతో దేశంలో గ్యాస్ కొరత!
* కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేతతో మూతపడుతున్న హోటళ్లు
* LPG ఉత్పత్తి 10% పెంచాం: కేంద్రం
* ఈ నెల 13న PM కిసాన్ నిధుల విడుదల
* అంతర్జాతీయ స్థాయి క్రీడలకు అమరావతి సిద్ధం: CBN
* 2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు: TG ప్రభుత్వం
* పెరిగిన బంగారం, వెండి ధరలు
* దాడులు తీవ్రం చేస్తామన్న US.. వెనక్కి తగ్గేదే లేదన్న ఇరాన్
News March 11, 2026
ఆపరేషన్ హార్ముజ్.. రంగంలోకి ఇండియన్ నేవీ?

హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న భారతీయ నౌకలను సేఫ్‌గా తీసుకురావడానికి నేవీని పంపాలని కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో తమ వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ జలసంధిని దాటలేక ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో 1,100 మందికిపైగా సెయిలర్స్ ఉన్న 38 భారతీయ వాణిజ్య నౌకలు చిక్కుకున్నాయి.
News March 11, 2026
BREAKING.. జగదాంబ జంక్షన్‌లో భారీగా నకిలీ నోట్లు స్వాధీనం

నగరంలోని జగదాంబ జంక్షన్ మెడికల్ షాపు సమీపంలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను సిటీ టాస్క్ ఫోర్స్, ఎంఆర్ పేట పోలీసులు సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు. పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సుమారు రూ.36 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 10 మంది ఈస్ట్, వెస్ట్, విశాఖ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించామని సీఐ దివాకర్ తెలిపారు.


