News August 21, 2025

అనకాపల్లి: స్త్రీ శక్తి పథకంతో రెట్టింపైన ఆక్యుపెన్సీ

image

స్త్రీ శక్తి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారిణి కె.ప్రవీణ బుధవారం తెలిపారు. ఈ పథకాన్ని జిల్లాలో మహిళలు సద్వినియోగం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పాయకరావుపేట, చోడవరం, మాడుగుల రూట్లలో గతంలో 40 శాతం ఉన్న మహిళా ప్రయాణికుల ఆక్యుపెన్సీ 80 శాతానికి పెరిగిందని అన్నారు. స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు.

Similar News

News March 18, 2026

WGL: పాముకాటుతో మూడేళ్ల చిన్నారి మృతి

image

ఆడుకుంటూ ఉన్న చిన్నారిని కాలనాగు కాటేయడంతో ఓ కుటుంబంలో తీరని శోకం నిండింది. నెక్కొండ మండలం భూక్యతండాకు చెందిన లావుడ్యా తిరుపతి-సుజాత దంపతుల కుమార్తె కుట్టి(3) మంగళవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా పాము కాటుకు గురైంది. పాప నోటి నుంచి నురుగు రావడాన్ని గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. చిన్నారి మృతితో తండాలో విషాదఛాయలు అలముకున్నాయి.

News March 18, 2026

అసెంబ్లీలో డ్రగ్స్ టెస్ట్ చేయాలి: కౌశిక్ రెడ్డి

image

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో డ్రగ్స్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ డ్రగ్స్ మాత్రమే కాకుండా మద్యం పరీక్షలు కూడా నిర్వహించాలని సవాల్ విసిరారు. కేటీఆర్‌పై కాంగ్రెస్ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పుపట్టారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అధికార దుర్వినియోగంపై ఆరోపణలు చేస్తూ బోనాలపల్లి ఘటనపై విచారణ జరపాలని కోరారు.

News March 18, 2026

పాకిస్థాన్‌కు అఫ్గాన్ క్రికెటర్ బిగ్ వార్నింగ్

image

కాబూల్‌ <<19403539>>ఆస్పత్రి<<>> ఘటనపై అఫ్గాన్ యంగ్ స్పిన్నర్ ఘజన్‌ఫర్ స్పందించారు. ‘దాడిలో గాయపడిన వారి వద్ద చికిత్స చేయించుకోవడానికి డబ్బుల్లేవు. సామాన్య ప్రజలపై దాడి చేయడాన్ని అఫ్గాన్ సహించదు. ప్రతిఒక్కరికీ AFG చరిత్ర తెలుసు. అది రిపీటైతే PAKకు మంచిది కాదు’ అని వార్నింగ్ ఇచ్చారు. తమకు భారత్ మిత్ర దేశమని, దాడుల గురించి చర్చించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇక ప్రపంచ దేశాలు AFGకు మద్దతుగా నిలవాలని ఘజన్‌ఫర్ కోరారు.