News August 21, 2025
నేడు హైకోర్టులో KCR, హరీశ్‌రావు పిటిషన్లపై విచారణ

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ KCR, హరీశ్‌రావు 2 వేర్వేరు పిటిషన్లు హైకోర్టులో దాఖలు చేశారు. ఈ కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలనే వీరి పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. రెండు పిటిషన్లను కలిపి హైకోర్ట్ జడ్జి జస్టిస్ కుమార్ సింగ్ విచారించనున్నారు. దీనిపై BRSకు రిలీఫ్ వస్తుందా? లేక ఏం జరగబోతోందనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
Similar News
News March 5, 2026
HYDలో వరుస ప్రమాదాలు.. జాగ్రత్త!

సిటీలో వరుసగా సంభవిస్తున్న ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. గత 2 నెలల్లో పదుల సంఖ్యలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం పట్ల ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. బాచుపల్లి ఘటన మరవక ముందే కాటేదాన్‌లో ఉదయం మంటలు చెలరేగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. వేసవి కాలంలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున అగ్నిప్రమాదాలకు అవకాశం ఉందని హైడ్రా, అగ్నిమాపక బృందాలు హెచ్చరిస్తున్నాయి. ఫైర్ సేఫ్టీ పాటించాలని సూచిస్తున్నాయి.
News March 5, 2026
HYD: చదువుకొనే పిల్లలనూ వదలడం లేదు!

JNTUHలో ప్రైవేటు సంస్థల జోక్యం వివాదానికి దారితీసింది. స్టూడెంట్స్‌కు క్రెడిట్ కార్డుల ఆశ చూపుతూ ECE డిపార్ట్‌మెంట్ వద్ద బ్యానర్లు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. డైరెక్టర్ అనిత అనుమతితోనే తాము పెట్టామని సదరు సంస్థ ప్రతినిధులు తెలపడంపై విమర్శలొస్తున్నాయి. చదువుకొనే వయసులో క్రెడిట్ కార్డులు ఇచ్చి వారిని అప్పుల ఊబిలోకి నెట్టడమేంటని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. దీనిపై మీ కామెంట్?
News March 5, 2026
HYD: గ్రేట్ సర్.. మరణించినా ప్రాణాలు కాపాడారు!

తాను మరణించిన ఆరుగురికి రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంబాదాస్ ప్రాణం పోశారు. అమీన్‌పూర్ బృందావన్ టీచర్స్ కాలనీలో ఉంటున్న అంబాదాస్(63) అధిక రక్తపోటుతో బాధ పడేవారు. ఫిబ్రవరి 28న ఒక్కసారిగా కుప్పకూలగా నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. మార్చి 3న బ్రెయిన్ డెడ్ కావడంతో ఆర్గాన్స్‌ను డొనేట్ చేసేందుకు ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకున్నారు. కుటుంబ నిర్ణయం స్ఫూర్తిదాయకం అని సజ్జనార్ ట్వీట్ చేశారు.


