News August 21, 2025

ఓరుగల్లు కాంగ్రెస్ నేతల మధ్య కుదరని సయోధ్య..!

image

వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్య కుదరనట్లుగానే తెలుస్తోంది. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మంత్రి కొండా సురేఖ లేకుండానే ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షురాలు స్వర్ణ పూలమాలవేసి వెళ్లిపోవడం హాట్ టాపిక్‌గా మారింది. వరంగల్ జిల్లాకు ఈనెల 25న మీనాక్షి నటరాజన్ రానున్న తరుణంలో కాంగ్రెస్ వర్గ విభేదాలు ఆమె పర్యటనలో ఏ విధంగా కనిపిస్తాయోనని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Similar News

News March 5, 2026

KMR: రేపు జిల్లా స్థాయి ప్రేరణ ఉత్సవం: డీఈఓ

image

ఈ నెల 6న జిల్లా స్థాయి ప్రేరణ ఉత్సవం నిజాంసాగర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి రాజు తెలిపారు. జిల్లాలోని ప్రతి ఉన్నత పాఠశాల నుంచి ఒక బాలిక, ఒక బాలున్ని ఎంపిక చేసి జిల్లా స్థాయి పోటీలకు పంపించాలని ఉపాధ్యాయులను కోరారు. ‘వికసిత భారత్-అందులో నా భాగస్వామ్యం’ అన్న అంశంపై పలురకాల పోటీలు నిర్వహించారు. ఎంపిక చేసి పీఎం చదువుకున్న పాఠశాల గుజరాత్‌కు పంపిస్తామన్నారు.

News March 5, 2026

నా ఆరోగ్యం బాగానే ఉంది: హోంమంత్రి

image

తన ఆరోగ్యం బాగానే ఉందని<<19304560>> హోంమంత్రి<<>> వంగలపూడి అనిత పేర్కొన్నారు. తీవ్ర అలసటతో అసెంబ్లీ సమావేశాల్లో గురువారం స్పృహ తప్పడంతో సమీపంలో గల ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారని పేర్కొన్నారు. పలువురు హోంమంత్రి ఆరోగ్యంపై ఆందోళన చెందుతుండగా ఈ నేపథ్యంలో ఆమె ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. అలసట కారణంగా చిన్న ఇబ్బంది ఏర్పడిందని, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని అందులో తెలిపారు.

News March 5, 2026

దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రత్యేక ప్రజావాణి: కలెక్టర్

image

జిల్లాలోని దివ్యాంగులు, వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి ఈనెల 7న కలెక్టరేట్‌లో ‘ప్రత్యేక ప్రజావాణి’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ తెలిపారు. శనివారం ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. బాధితులు నేరుగా వచ్చి తమ విన్నపాలను అందజేయవచ్చని, అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.