News August 21, 2025

దూసుకుపోతున్న KPHB ‘రియల్’ బిజినెస్

image

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా తగ్గుముఖం పడుతోందని వస్తున్న వార్తలను పటాపంచలు చేస్తూ KPHB కాలనీలో ఎకరం ఏకంగా రూ.70 కోట్లు పలికింది. ఐటీ కారిడార్‌కు పక్కనే ఉండడం, కమర్షియల్‌ నిర్మాణాలు శరవేగంగా పెరగుతుండటంతో ఇక్కడి రియల్ వ్యాపారం దూసుకుపోతోందని నిపుణుల అంచనా. గతంలో హౌసింగ్ బోర్డు వేలం వేసిన ప్రతి వేలంపాటలో కూడా ఎక్కడా లేని విధంగా ధర పలుకుతూ వచ్చింది. ఇప్పుడు నగరంలో KPHB హాట్ కేక్‌గా మారింది.

Similar News

News April 3, 2026

HYD‌లో ట్రాఫిక్ జామ్.. కారణం ఇదే!

image

ఐటీ కారిడార్‌లోని సైబర్ టవర్స్ వద్ద మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన సర్వేలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఉదయం వేళ కేవలం ఒక గంటలోనే ఏకంగా 10,138 మంది ఒంటరి వాహనదారులు (సింగిల్ రైడర్లు) వెళ్లినట్లు గుర్తించారు. డబుల్ రైడర్లు 3,584 మంది మాత్రమే ఉన్నారని తేలింది. ఈ స్థాయిలో సింగిల్ రైడర్ల సంఖ్య పెరగడం వల్లే రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు.

News April 3, 2026

HYD: ఇద్దరు IAS అధికారులకు పోస్టింగ్‌లు

image

తెలంగాణలో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు పోస్టులు కేటాయిస్తూ సీఎస్ రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. వాణి ప్రసాద్‌ను యువజన అభివృద్ధి, పర్యాటకం, సంస్కృతి శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించారు. జయేష్ రంజన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతూ.. క్రీడా శాఖకు అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.