News August 21, 2025
ర్యాపిడోకు రూ.10 లక్షల జరిమానా

క్యాష్ బ్యాక్, తక్కువ ధరకు రైడ్ పేరుతో వినియోగదారులను తప్పుదోవ పట్టించారంటూ ర్యాపిడోకు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ(CCPA) రూ.10 లక్షల ఫైన్ వేసింది. ‘5 నిమిషాల్లో ఆటో రాకపోతే రూ.50 పొందండి’ అంటూ తప్పుదోవ పట్టించారన్న ఫిర్యాదుపై చర్యలకు దిగింది. డబ్బులు రిటర్న్ ఇవ్వకపోగా కండిషన్స్ పేరుతో కాయిన్స్ ఇచ్చినట్లు గుర్తించింది. ఈ ప్రచారంతో ప్రభావితమైన వినియోగదారులకు రీఫండ్ చేయాలని ఆదేశించింది.
Similar News
News March 14, 2026
NRPT: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

కృష్ణ మండల పరిధిలోని గుడెబల్లూర్ గ్రామం శివార్లలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. HP బంక్ సమీపంలో బైక్ అదుపుతప్పి లారీని ఢీకొనడంతో కర్ణాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు 108లో రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా కజప్ప(71) మార్గమధ్యలోనే మరణించాడు. మరొకరు రామయ్య (67) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News March 14, 2026
సూర్య కొత్త సినిమాపై అప్డేట్

సూర్య-వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ & సన్స్’ మూవీ టీజర్‌ను ఈ నెల 16న సా.4.06 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్యకు జోడీగా మమిత బైజు నటిస్తుండగా రాధిక, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. GV ప్రకాశ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
News March 14, 2026
సోదరిని 84 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు!

తనతో పాటు పుట్టిన సోదరిని ఓ వ్యక్తి కిరాతకంగా చంపిన ఘటన UPలో జరిగింది. కవల సోదరి హిమాన్షిక(25)తో పాటు హార్దిక్ ఏడాదిన్నర కిందటి వరకు ఇంజినీర్‌గా పనిచేసేవాడు. జాబ్ మానేశాక SMలో ఎక్కువ టైమ్ గడపడం, ఓ అమ్మాయిని లవ్ చేస్తున్న విషయంలో సోదరుడిని హిమాన్షిక మందలించింది. కక్ష పెంచుకున్న అతను సోదరిపై 84సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఆపై సర్‌ప్రైజ్ అంటూ తల్లికి డెడ్‌బాడీ చూపించి ఆమెపైనా దాడి చేశాడు.


