News August 21, 2025

పిఠాపురం: కొత్త జంటకు తప్పని వరద కష్టాలు

image

కొత్తగా పెళ్లైన జంటను వరద కష్టాలు వెంటాడాయి. గొల్లప్రోలు కొత్త కాలనీకి చెందిన అపర్ణాదేవికి విశాఖ వాసి పార్థసారథితో ఈ నెల 18వ తేదీ తెల్లవారుజామున వివాహమైంది. అత్తవారింటికి వచ్చేందుకు కొత్త జంట గొల్లప్రోలు చేరుకుంది. అయితే వరద నీరు అడ్డంకిగా మారింది. సుద్దగెడ్డ కాలువపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె నిచ్చెన ఎక్కి వంతెన దాటి కాలనీకి చేరుకోవాల్సి వచ్చింది.

Similar News

News April 2, 2026

YCP కాదు.. ‘వనభోజనం’ పార్టీ అని పెట్టుకో: MLA గోరంట్ల సెటైర్..!

image

వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ కారిడార్‌పై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురువారం ట్విటర్(X) వేదికగా విమర్శలు గుప్పించారు. పార్టీలోని ముఖ్య నేతలైన వంశీలోని VA, నానిలో NA, బొత్సలో BO, జగన్‌లో JA, అప్పల నాయుడులో NA తీసుకుంటే VA-NA-BO-JA-NA వస్తుందన్నారు. ఐదేళ్లలో రాష్ట్ర ఆదాయాన్ని వనభోజనంలా భుజించారని విమర్శిస్తూ, ‘వనభోజనం పార్టీ’గా పేరు మార్చుకోవాలని సూచించారు.

News April 2, 2026

క్రికెట్‌కు సౌతాఫ్రికా ప్లేయర్ గుడ్‌బై

image

సౌతాఫ్రికా బ్యాటర్ రస్సీ వాన్‌డెర్ డసెన్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రొటీస్ బోర్డుకు, సహచర ఆటగాళ్లకు, అండగా నిలిచిన కోచ్‌లు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. 37 ఏళ్ల డసెన్ SA తరఫున 71 వన్డేల్లో 2,657 పరుగులు, 57 టీ20ల్లో 1,406, 18 టెస్టుల్లో 905 రన్స్ చేశారు. 2022 IPLలో RR తరఫున, SA లీగ్‌లో MI కేప్‌టౌన్‌ తరఫున ఆడారు.

News April 2, 2026

రీసర్వే పనులను పరిశీలించిన కలెక్టర్

image

గోరంట్ల మండలం గౌనివారిపల్లిలో జరుగుతున్న రీసర్వే గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పరిశీలించారు. సర్వే నంబర్లు 136 నుంచి 140 వరకు ఉన్న 40 ఖాతాల భూములను రెవెన్యూ రికార్డులతో సరిపోల్చి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారికి నోటీసులు సకాలంలో అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. భూ వివాదాలు లేకుండా పారదర్శకంగా సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.