News August 21, 2025
విజయనగరంలో పేకాట రాయుళ్లు అరెస్ట్: సీఐ

విజయనగరం శుద్ధ వీధిలోని ఓ ఇంటిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు టూ టౌన్ సీఐ టి.శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఎస్.బంగారునాయుడు ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. రూ.48,810 నగదు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఏడుగురిపై కేసు నమోదు చేశామన్నారు. కాగా వీరిలో పలువురు వైసీపీ నేతలు ఉన్నట్లు సమాచారం.
Similar News
News August 21, 2025
MTM: గృహ నిర్మాణం, కేంద్ర అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష

బందరులో కలెక్టర్ బాలాజీ గృహ నిర్మాణం, కేంద్ర అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. గృహ నిర్మాణాల గడువు వచ్చే మార్చి 31వరకు పొడిగించినట్లు తెలిపారు. జిల్లాలో 2.36లక్షల పింఛన్లలో 4,332 అనర్హులైన దివ్యాంగుల పింఛన్లు ఆపివేసినట్లు పేర్కొన్నారు. వాళ్లల్లో అర్హులకు మళ్లీ అందిస్తామని తెలిపారు. స్వామిత్వ భూముల రికార్డుల ఆన్‌లైన్ ప్రక్రియ 20% పూర్తై, డిసెంబర్‌లో 100% చేస్తామన్నారు.
News August 21, 2025
VZM: హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ

షెడ్యూల్ కులాల యువతకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కలెక్టర్ అంబేడ్కర్ గురువారం తెలిపారు. కనీసం ఏడాది కాల పరిమితి గల లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలన్నారు. దరఖాస్తులను ఈనెల 27వ తేదీ లోపు కంటోన్మెంట్ కార్యాలయానికి అందజేయాలని పేర్కొన్నారు. ఐదుగురు స్త్రీలు, ఐదుగురు పురుషులను మాత్రమే ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.
News August 21, 2025
BREAKING: సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ

AP: గ్రామ, వార్డు సచివాలయల్లో 2,778 డిప్యుటేషన్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 1,785 గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా 993 కొత్త పోస్టులను మంజూరు చేసింది. చింతూరు CHCని 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు అంగీకరించింది. వీటితో పాటు నాలా పన్ను 4 శాతంలో 70శాతం స్థానిక సంస్థలకు, 30శాతం అథారిటీలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు.