News August 21, 2025
నెల్లూరు: ప్రేమజంటకు ప్రాణహాని

కందుకూరుకు చెందిన అఖిల్, దివ్య ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇటీవల ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు. తమకు పెద్దల నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించారు. నెల్లూరు ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. తమ తల్లిదండ్రులకు పోలీసులు రెండుసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా ఇంకా తమను బెదిరిస్తున్నారని వాపోయారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని కోరారు.
Similar News
News March 21, 2026
నెల్లూరు జిల్లాలో లక్ష సిలిండర్ల బుకింగ్..!

యుద్ధం నేపథ్యంలో గ్యాస్ దిగుమతిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈక్రమంలో నెల్లూరు జిల్లాలో గడిచిన 10రోజుల్లోనే లక్ష సిలిండర్లను బుక్ చేశారు. సాధారణంగా నెలకు 40 వేల నుంచి 50 వేల వరకు డొమెస్టిక్ సిలిండర్లు బుక్ అయ్యేవి. గ్యాస్ కొరత వస్తుందేమోననే భయంతో ప్రజలు ఎగబడటంతో బుకింగ్ సంఖ్య లక్షకు చేరింది. సిలిండర్లకు ఇబ్బంది లేదని అధికారులు స్పష్టం చేస్తూనే ఉన్న ప్రజలు భయాందోళన వీడటం లేదు.
News March 21, 2026
నెల్లూరు: మాఫియాకు చెక్ పెట్టేది ఎప్పుడు.. ఎలా?

ఒక్కసారి జరిగితే తప్పు. అదే పదేపదే జరిగితే నేరం. ప్రస్తుతం నెల్లూరులో జరిగేది ఇదే. రాజకీయ నేతల అండదండలతో రేషన్ బియ్యాన్ని దోచేస్తున్నారు. 2025లో 73 కేసులు నమోదు చేసి 2400 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. 2026లో 14 కేసులు నమోదు చేసి 650.8 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. 15 నెలల్లోనే రూ. 1.37 కోట్ల ధాన్యం పట్టుబడింది. మాఫియాకు అధికారులు సైతం అండగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
News March 21, 2026
నెల్లూరు జిల్లా రైతులకు తీవ్ర నష్టం

నెల్లూరు జిల్లాలో వరి పంట చేతికోస్తుంది. ఈక్రమంలో అకాల వర్షాలు రైతులను ముంచేసింది. అనంతసాగరం, కలవాయి,రాపూరు, మర్రిపాడు మండలాల పరిధిలో ఇటీవల వర్షం కురిసింది. దీంతో 19 గ్రామాల పరిధిలో వరి 1157 హెక్టర్లు, పత్తి 140 హెక్టర్లలో మొత్తంగా 1297 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు వ్యవసాయ అధికారులు చెప్పారు.


