News August 21, 2025

ఇడుపులపాయలో IIIT విద్యార్థి సూసైడ్

image

ఇడుపులపాయ IIITలో విషాదం నెలకొంది. నరసింహనాయుడు అనే విద్యార్థి మృతిచెందాడు. బాత్ రూములో ఉరేసుకున్నాడని సమాచారం. మృతదేహాన్ని వేంపల్లి ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విద్యార్థిది శ్రీకాకుళం జిల్లా అని తెలుస్తోంది. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Similar News

News March 11, 2026

విజయవాడలో మాజీ ఎంపీ సురేశ్‌పై ఛీటింగ్ కేసు నమోదు

image

కాకినాడకు చెందిన ఓ ట్రస్ట్ రెన్యూవల్ వ్యవహారంలో మాజీ ఎంపీ నందిగం సురేశ్ మోసం చేసారంటూ సూర్యారావుపేట పోలీసులను బాధితులు ఆశ్రయించారు. ట్రస్ట్ రెన్యూవల్ చేయిస్తానంటూ రూ.25 లక్షలు తీసుకున్న సురేశ్ ఆ పని చేయించలేదంటూ బాధితులు పోలీసులకు విన్నవించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు సురేశ్‌పై నేర శిక్షాస్మృతి ప్రకారం కేసు నమోదు చేసినట్లు తాజాగా సమాచారం వెలువడింది.

News March 11, 2026

శ్రీకాకుళం: ఆగి ఉన్న కారును ఢీకొన్న లారీ

image

శ్రీకాకుళం మండలం జాతీయ రహదారిలో ఉన్న డెంటల్ కాలేజీ వద్ద బుధవారం ఆగి ఉన్న కారును లారీ ఢీకొంది. కారు మరమ్మతులకు గురికావడంతో కారులో ఉన్నవారు దిగి మెకానిక్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సమయంలోనే నరసన్నపేట నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న లారీ కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయాడు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.

News March 11, 2026

‘కరోనా’కు ఆరేళ్లు

image

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసిన కరోనాను WHO ‘మహమ్మారి’గా ప్రకటించి నేటికి ఆరేళ్లు. చైనాలో మొదలైన ఈ వైరస్ అతి తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించి లక్షలాది మంది ప్రాణాలను బలిగొంది. వైద్యులు, శాస్త్రవేత్తల కృషితో వచ్చిన టీకాలు వైరస్ కట్టడికి దోహదపడ్డాయి. రోజులు గడిచిపోతున్నా ఆనాటి చేదు జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మీ కామెంట్?