News August 21, 2025
షాకింగ్: పోర్న్ సైట్లో ప్రిన్సెస్ డీప్ ఫేక్ వీడియో

డీప్ ఫేక్ భూతం ఎవరినీ వదలడం లేదు. తాజాగా నెదర్లాండ్స్ కింగ్ విల్లెం అలెగ్జాండర్ కూతురు, కాబోయే క్వీన్ ‘ప్రిన్సెస్ క్యాథరినా అమాలియా’ ఫేస్‌ను మార్ఫ్ చేసి పోర్న్ సైట్లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(FBI) దర్యాప్తు చేపట్టింది. వీడియోను ప్రమోట్ చేస్తున్న ప్లాట్‌ఫామ్‌లను మూసివేయించింది. క్యాథరినా మార్ఫ్‌డ్ వీడియోలు 2022లోనూ వైరల్ కాగా అప్పట్లో కలకలం రేగింది.
Similar News
News March 14, 2026
అంగన్‌వాడీ ఆయాలకు ప్రమోషన్లు.. మార్గదర్శకాలివే

AP: అంగన్‌వాడీ హెల్పర్లను వర్కర్లుగా పదోన్నతి కల్పించడానికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం ఖాళీగా ఉన్న వర్కర్ పోస్టుల్లో 50% అర్హులైన హెల్పర్లతో భర్తీ చేయాలి. టెన్త్ ఉత్తీర్ణత, ఐదేళ్ల సర్వీసు, ఫిట్‌నెస్ తప్పనిసరి. నియామక సంవత్సరం జులై 1 నాటికి 50yrs దాటకూడదు. సీనియారిటీ, వయస్సు, విద్యార్హతలను బట్టి పదోన్నతులు కల్పిస్తారు. ప్రభుత్వ రిజర్వేషన్లు కచ్చితంగా పాటించాలి.
News March 14, 2026
పుచ్చకాయ కొనేటప్పుడు ఇవి గమనించండి!

పుచ్చకాయపై ఉండే మచ్చ పసుపు/నారింజ రంగులో ఉంటే పండినట్లు, తెల్లగా ఉంటే ఇంకా పండనట్లు. గుండ్రటి కాయలు తీయగా ఉంటాయి. పొడవుగా ఉండేవి తక్కువ తీపి కలిగి ఉంటాయి. ఒకే సైజులో ఉన్న వాటిలో బరువు ఎక్కువగా ఉన్నది తీసుకోవాలి. వాటిలో గుజ్జు, రసం ఎక్కువగా ఉంటాయి. కాయ కాడ పూర్తిగా ఎండిపోయి, మెరుపు తక్కువగా ఉంటే అది సహజంగా పాదుపైనే పండిందని అర్థం. గోధుమ రంగు గీతలు ఉన్న కాయలు చాలా తీయగా ఉంటాయి.
News March 14, 2026
పుతిన్ ప్రపోజల్‌కు నో చెప్పిన ట్రంప్!

ఇరాన్ వద్ద ఉన్న 450 కిలోల (60% శుద్ధి చేసిన) యురేనియంను రష్యాకు తరలించాలని పుతిన్ చేసిన ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. యుద్ధాన్ని ఆపేందుకు ఇది ఒక మార్గమని పుతిన్ చెప్పినట్లు తెలిపింది. ఈ యురేనియంతో సుమారు 11 అణు బాంబులను తయారు చేయవచ్చని సమాచారం. అందుకే ఈ యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవాలి లేదా పనికిరాకుండా చేయాలని US ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.


