News August 21, 2025

ANU: పీజీ పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలో ఏప్రిల్ 2025లో నిర్వహించిన M.SC. ఫారెస్ట్రీ 4వ, ఇంటిగ్రేటెడ్ M.A. పబ్లిక్ పాలసీ సెకండియర్ 4వ, M.B.A.(మీడియా మేనేజ్‌మెంట్) 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ANU పరీక్షల విభాగం తెలిపింది.

Similar News

News April 6, 2026

దుగ్గిరాలలో అనాథలా మిగిలిన అమ్మ..!

image

ఎవరో తెలియదు.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వారం రోజులుగా కదల లేని స్థితిలో ఓ అనాథ అమ్మ దుగ్గిరాలలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం ఆవరణలో నిస్సత్తువగా పడి ఉంది. అటుగా వెళ్తున్న వారు చూసి అయ్యో పాపం అని వెళుతున్నవారే తప్పా ఎవ్వరూ ఆదుకోవడం లేదు. అస్పష్టంగా ఉన్న ఆమె మాటలు విన్న వారు సంపన్న కుటుంబానీకి చెందినదై ఉండవచ్చని భావిస్తున్నారు. మరి ఆ అమ్మను అక్కున చేర్చి ఆదరించేదెవరో..?

News April 6, 2026

శాంతి భద్రతల పరిరక్షణే కార్డన్ సెర్చ్ లక్ష్యం: SP

image

శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు
గుంటూరు SP వకుల్ జిందాల్ తెలిపారు. తాడేపల్లి పరిధి సలాం సెంటర్ పరిధిలో సోమవారం ఉదయం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలు సీజ్ చేశారు. అనంతరం స్థానిక యువకులతో డ్రగ్స్ వద్ద బ్రో ప్రతిజ్ఞ చేయించారు. ఎస్పీతో పాటు, డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ వీరేంద్ర సిబ్బంది ఉన్నారు.

News April 6, 2026

గుంటూరులో 5 రైల్వే గేట్ల వద్ద వంతెనల నిర్మాణానికి ప్రణాళిక

image

గుంటూరు జిల్లాలో 5 రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద ROB నిర్మాణానికి రైల్వే శాఖ ముందడుగు వేసింది. శ్యామలనగర్, సంజీవయ్యనగర్, నెహ్రూనగర్ ప్రాంతాలతో పాటు అమరావతి ఈ-13 రోడ్, నంబూరు-మంగళగిరి మార్గాల్లో అధ్యయనం చేపడతారు. ఈ నెలలోనే కన్సల్టెన్సీ ఎంపిక చేసి DPR సిద్ధం చేయనున్నారు. ట్రాఫిక్ సమస్యల కారణంగా నెహ్రూనగర్, సంజీవయ్యనగర్ గేట్లకు ప్రాధాన్యం ఇచ్చారు. 2 సంవత్సరాల్లో దశలవారీగా పనులు పూర్తి చేయనున్నారు.