News August 21, 2025
పొదిలి: టీ తాగి వస్తానని భర్త పరార్.!

పొదిలిలోని పోతవరానికి చెందిన యువకుడు ప్రేమించి వివాహం చేసుకున్న భార్యకు మొహం చాటేసి పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలు బుధవారం పొదిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తెలంగాణలోని ఆర్మూరు బస్ స్టేషన్‌లో టీ తాగి వస్తానని వదిలేసి పరారయ్యాడని, తీరా పొదిలికి వస్తే రూ.10 లక్షలు తెస్తేనే భార్యగా అంగీకరిస్తానని చెబుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News August 21, 2025
పద్ధతి మార్చుకోకపోతే.. జాబ్ నుంచే తొలగిస్తా: కలెక్టర్ వార్నింగ్

విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే వారికి ఉద్యోగం ఎందుకు? పద్ధతి మార్చుకోకపోతే టెర్మినేట్ చేసేస్తా అంటూ కలెక్టర్ తమీమ్ అన్సారియా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఐసీడీఎస్ అధికారులతో కలెక్టర్ గురువారం సమీక్షించారు. వాస్తవ వివరాలను నమోదు చేయకుండా పలువురు ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని సిబ్బంది పనితీరు మార్చుకోవాలన్నారు.
News August 21, 2025
ప్రకాశానికి మంత్రుల రాక

జిల్లాల పునర్విభజన మార్పులపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ఈ నెల 30వ తేదీన ప్రకాశం జిల్లాకు రానున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లాలోని మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించడం, కందుకూరును జిల్లాలో కలపడం, ఇతర అంశాలపై మంత్రుల బృందం ప్రజాభిప్రాయ సేకరణ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. మంత్రులు నిమ్మల రామానాయుడు, సత్య కుమార్ యాదవ్ జిల్లాకు రానున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే అధికారులు ధృవీకరించాల్సి ఉంది.
News August 21, 2025
పొదిలి: టీ తాగి వస్తానని భర్త పరార్.!

పొదిలిలోని పోతవరానికి చెందిన యువకుడు ప్రేమించి వివాహం చేసుకున్న భార్యకు మొహం చాటేసి పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలు బుధవారం పొదిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తెలంగాణలోని ఆర్మూరు బస్ స్టేషన్‌లో టీ తాగి వస్తానని వదిలేసి పరారయ్యాడని, తీరా పొదిలికి వస్తే రూ.10 లక్షల తెస్తేనే భార్యగా అంగీకరిస్తానని చెబుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.