News August 21, 2025
నేపాల్ వాదనను ఖండించిన భారత్

భారత సరిహద్దులో ఉన్న లింపియాధుర, లిపులేఖ్, కాలాపాణిలు తమ ప్రాంతాలేనన్న నేపాల్ వాదనను భారత్ ఖండించింది. ‘లిపులేఖ్ ద్వారా IND-CHINA మధ్య 1953లోనే వాణిజ్యం మొదలైంది. తర్వాత కొన్ని కారణాలతో నిలిచిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్లీ ప్రారంభించాలని ఇరుదేశాలూ నిర్ణయించాయి. దీనిపై నేపాల్ అభ్యంతరం చెప్పడం సరికాదు’ అని పేర్కొంది. కాగా IND-CHI వివాదాలు పక్కనబెట్టి వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకుంటున్నాయి.
Similar News
News August 21, 2025
BREAKING: సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ

AP: గ్రామ, వార్డు సచివాలయల్లో 2,778 డిప్యుటేషన్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 1,785 గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా 993 కొత్త పోస్టులను మంజూరు చేసింది. చింతూరు CHCని 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు అంగీకరించింది. వీటితో పాటు నాలా పన్ను 4 శాతంలో 70శాతం స్థానిక సంస్థలకు, 30శాతం అథారిటీలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు.
News August 21, 2025
పంచాయతీరాజ్ శాఖలో రేపటి నుంచి పనుల జాతర

TG: పంచాయతీరాజ్ శాఖలో రేపటి నుంచి పనుల జాతర మొదలవుతుందని మంత్రి సీతక్క తెలిపారు. పనుల జాతర పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. రూ.2,198 కోట్ల విలువైన 1.01 లక్షల పనులు శుక్రవారం నుంచి ప్రారంభం అవుతాయన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్లు, పొలాలకు మట్టి రోడ్లు, చెక్‌డ్యామ్‌లు, అంతర్గత సీసీ రోడ్లు, వాటర్ షెడ్లు, పశువుల కొట్టాలు, నర్సరీల పెంపకం, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, తదితర పనులు చేపడతామన్నారు.
News August 21, 2025
ఆసియా కప్‌లో యథావిధిగా భారత్-పాక్ మ్యాచ్‌లు!

భారత్-పాక్ మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు/స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. మన క్రీడాకారులు పాక్‌లో గానీ, వాళ్ల ప్లేయర్లు భారత్‌లో గానీ ఎలాంటి ఈవెంట్స్‌లో పాల్గొనరని చెప్పింది. అయితే ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌కు సంబంధించి న్యూట్రల్ వేదికల్లో ఇరు దేశాలు తలపడేందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఆసియా కప్ UAEలో జరగబోతోంది. అంటే ఇందులో IND-PAK మధ్య పోరు ఉంటుందని స్పష్టమవుతోంది.