News August 21, 2025
కృష్ణా: జిల్లాల పేర్ల మార్పుపై ఉత్కంఠ

జిల్లాల పునర్విభజనపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు సమావేశం కానుంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాను విజయవాడగా మార్చి, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నూజివీడు, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో, కైకలూరును కృష్ణాలో, నందిగామ, జగ్గయ్యపేటలను అమరావతి జిల్లాలో విలీనం చేయనున్నట్లు సమాచారం.
Similar News
News August 21, 2025
MTM: గృహ నిర్మాణం, కేంద్ర అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష

బందరులో కలెక్టర్ బాలాజీ గృహ నిర్మాణం, కేంద్ర అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. గృహ నిర్మాణాల గడువు వచ్చే మార్చి 31వరకు పొడిగించినట్లు తెలిపారు. జిల్లాలో 2.36లక్షల పింఛన్లలో 4,332 అనర్హులైన దివ్యాంగుల పింఛన్లు ఆపివేసినట్లు పేర్కొన్నారు. వాళ్లల్లో అర్హులకు మళ్లీ అందిస్తామని తెలిపారు. స్వామిత్వ భూముల రికార్డుల ఆన్‌లైన్ ప్రక్రియ 20% పూర్తై, డిసెంబర్‌లో 100% చేస్తామన్నారు.
News August 21, 2025
కృష్ణా: గణేష్ ఉత్సవాలకు ఆంక్షలివే..!

కృష్ణాజిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు వినాయక చవితి సందర్భంగా మండప నిర్వాహకులకు మార్గదర్శకాలు జారీ చేశారు. బుధవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి అన్నారు. మట్టి విగ్రహాలే వాడాలన్నారు. CC కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రశాంత వాతావరణంలో భక్తి గీతాలు మాత్రమే వినిపించాలని, DJలు, బాణసంచా, శబ్ద కాలుష్యం, రోడ్ల ఆక్రమణలు నిషేధమని హెచ్చరించారు.
News August 21, 2025
మచిలీపట్నం: పీ-4 అమలుపై కలెక్టర్ సమీక్ష

మచిలీపట్నం కలెక్టరేట్‌లో కలెక్టర్ డీకే బాలాజీ పి-4 పథకం అమలుపై బుధవారం సమీక్షించారు. ఉన్నత వర్గాల ప్రజలను మార్గదర్శిలుగా స్వచ్ఛందంగా చేరేలా చైతన్య పరచాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 53,759 పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించామన్నారు. 48,375 కుటుంబాలు 4,272 మార్గదర్శులతో అనుసంధానం అయినట్లు తెలిపారు. పేదలను ఆర్థికంగా, విద్యలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు.