News August 21, 2025

కృష్ణా: ఆ ఎరువులు మాకొద్దు బాబోయ్!

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎరువుల కొరత ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు లక్ష మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా, కేవలం 65 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో 25 శాతం ద్రవ రూపంలో ఉన్న నానో యూరియా. అయితే నానో యూరియా వల్ల పంటకు బలం చేకూరదని రైతులు వాపోతున్నారు. బయట మార్కెట్‌లో రూ.400-450కి ఎరువులు అమ్ముతున్నారని, బిల్లులు కూడా ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు.

Similar News

News March 26, 2026

మదనపూర్‌లో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రత

image

వనపర్తి జిల్లాలో 21 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాలలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా… అత్యధికంగా మదనాపూర్‌లో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. పెద్దమందడి 38, ఏదుల 37.9, వనపర్తి, శ్రీరంగాపూర్, దీపనగండ్ల, వెలుగొండ 37.7, కానాయపల్లి, ఆత్మకూరులో 37.6, దగడ 37.2, విలియంకొండ, సోలిపూర్, జానంపేట 37.0, పాన్గల్ 36.7, ఘన్పూర్ 36.6, రేవల్లి 36.4, పెబ్బేరు 36.3, డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 26, 2026

నేటి నుంచి భానుడి భగభగలు

image

TG: నేటి నుంచి భానుడు భగ్గుమంటాడని వాతావరణ నిపుణులు తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 39-41 డిగ్రీలు, హైదరాబాద్‌లో 38-39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. అధిక ఉష్ణోగ్రతలతో వికారాబాద్, సంగారెడ్డి, RR, నారాయణపేట్, ADB, ఆసిఫాబాద్ జిల్లాల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు.

News March 26, 2026

విశాఖలో యాక్సిడెంట్‌లకు ప్రధాన కారణాలివే..

image

విశాఖ జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు పెరగడానికి మానవ తప్పిదాలే ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. అతివేగం, అనుభవం లేని డ్రైవర్లు, నిర్లక్ష్య డ్రైవింగ్‌, డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. రహదారులపై ఆక్రమణలు, అనధికార పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ లోపం పరిస్థితిని తీవ్రతరం చేస్తున్నాయి. శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, నిబంధనల అమలులో అలసత్వం, వాహనాల లోపాలు కూడా ప్రమాదాల పెరుగుదలకు కారణమవుతున్నాయి.