News April 1, 2024
తిహార్ జైలులో కేజ్రీవాల్‌కు ఉండే సదుపాయాలు ఇవే!
కేజ్రీవాల్‌కు టీవీలో 18-20 ఛానల్స్ చూసేందుకు జైలు అధికారులు అనుమతిచ్చారు. 24 గంటలూ మెడికల్ స్టాఫ్ అందుబాటులో ఉంటారు. ఆయనకు డయాబెటిస్ సమస్య ఉండడంతో రెగ్యులర్ చెకప్‌లు చేయనున్నారు. వారానికి రెండు సార్లు ఫ్యామిలీతో మాట్లాడేందుకు అవకాశం ఇస్తారు. 3 పుస్తకాలు, టేబుల్, కుర్చీ, మందులు అనుమతించాలని ఆయన కోర్టును కోరారు. ఇందుకు కోర్టు అనుమతించిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Similar News
News November 8, 2024
గీజర్ వాడుతున్నారా? ఇవి తెలుసుకోండి!
చాలామంది గీజర్‌ను గంటల తరబడి ఆన్‌లోనే ఉంచుతారు. అది ఏమాత్రం మంచిదికాదు. ఒక్కోసారి గీజర్ ఓవర్ హీట్ ఎక్కి పేలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక గీజర్‌ను ఏడాదికోసారి సర్వీసింగ్ చేయించాలి. అప్పుడే ఏమైనా లీకేజీ ఉంటే తెలుస్తుంది. గీజర్ కనెక్షన్ వైర్లను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. చాలా ఏళ్లుగా వాడుతున్న పరికరాలను మార్చడం ఉత్తమం. వాటి వల్ల షార్ట్ సర్య్కూట్ వచ్చే ప్రమాదం ఉంది.
News November 8, 2024
రోహిత్‌శర్మ నుంచి అది నేర్చుకున్నా: సూర్య
ఆటలో గెలుపోటములు సహజమని, ఓడినంత మాత్రాన మన మనస్తత్వం మార్చుకోవద్దని టీమ్ ఇండియా T20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అన్నారు. ఆ విషయాన్ని రోహిత్‌శర్మను చూసే నేర్చుకున్నానని సూర్య చెప్పారు. రోహిత్ గ్రౌండ్‌లో ఎలా ఉంటారో తాను గమనిస్తూ ఉంటానన్నారు. అందరూ హార్డ్‌వర్క్ చేస్తారని, కొన్నిసార్లు కలిసొస్తే, కొన్నిసార్లు వర్కవుట్ కాదని సూర్య చెప్పుకొచ్చారు. రేపు సౌతాఫ్రికాతో T20 సిరీస్ ప్రారంభం కానుంది.
News November 8, 2024
నవంబర్ 8: చరిత్రలో ఈరోజు
* 1948: గాంధీని హత్య చేసినట్లు అంగీకరించిన గాడ్సే
* 2016: పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన కేంద్రం
* 1656: తోకచుక్కను కనుగొన్న సైంటిస్ట్ ఎడ్మండ్ హేలీ జననం
* 1927: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ పుట్టినరోజు
* 1969: సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు
* 1977: డైరెక్టర్ బీఎన్ రెడ్డి మరణం
* 2013: కమెడియన్ ఏవీఎస్ మరణం