News August 21, 2025
కృష్ణా: రేషన్ స్మార్ట్ కార్డుల జారీకి రంగం సిద్ధం

ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొత్త రేషన్ స్మార్ట్ కార్డులు పంపిణీకి సిద్ధమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 70 వేలమంది కొత్త దరఖాస్తుదారులకు ఈ నెల 25న ఏటీఎం సైజు స్మార్ట్ కార్డులు అందజేయనున్నారు. ఇందులో ఎన్టీఆర్ జిల్లాలో 58,094, కృష్ణా జిల్లాలో 11,179 దరఖాస్తులు ఉన్నాయి. ఇప్పటికే పాత కార్డులు ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో 5.90 లక్షల మందికి, కృష్ణా జిల్లాలో 5.22 లక్షల మందికి కూడా ఈ కార్డులు ఇవ్వనున్నారు.
Similar News
News March 13, 2026
ఏపీ క్యాబినెట్ సమావేశం.. 27 అంశాలకు ఆమోదం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ భేటీ ముగిసింది. 27 అజెండా అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాగా అనారోగ్యం కారణంగా ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత సహా మంత్రులు నాదెండ్ల మనోహర్, గొట్టిపాటి రవికుమార్, టీజీ భరత్, ఎండీ ఫరూక్ హాజరుకాలేదు.
News March 13, 2026
అబ్రార్‌ది యునిక్ బౌలింగ్.. అందుకే తీసుకున్నాం: SRH హెడ్ కోచ్

The Hundred(ఇంగ్లండ్) టోర్నీ కోసం పాక్ స్పిన్నర్ అబ్రార్‌ను తీసుకోవడంపై SRH హెడ్ కోచ్ వెటోరీ స్పందించారు. ‘అతనిది యునిక్ బౌలింగ్. ఎన్నో వేరియేషన్స్‌తో బౌలింగ్ చేస్తారు. ఇలాంటి ప్లేయర్లను గతంలో చూసి ఉండరు. టోర్నీకి అందుబాటులో ఉంటాడనే వేలంలో కొనుగోలు చేశాం’ అని పేర్కొన్నారు. కాగా పాక్ ఆటగాడిని సన్ రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడంపై వస్తున్న <<19368622>>తీవ్ర విమర్శలపై<<>> ఓనర్ కావ్యా మారన్ స్పందించలేదు.
News March 13, 2026
గుంటూరు జీజీహెచ్‌లో వాట్సాప్ ద్వారా OP చీటీ

గుంటూరు జీజీహెచ్‌లో ఓపీ చీటీ కోసం కొత్తగా వాట్సాప్ సేవలు ప్రారంభించారు. రోగులు 95523 00009 నంబరుకు హాయ్ అని మెసేజ్ పంపితే సేవలు అందుబాటులోకి వస్తాయి. కావాల్సిన రోజు, విభాగాన్ని ఎంపిక చేసి ముందుగానే ఓపీ బుక్ చేసుకోవచ్చు. ఆస్పత్రికి వచ్చిన తర్వాత వాట్సాప్ బుకింగ్ వివరాలు చూపిస్తే వెంటనే ఓపీ చీటీ ఇస్తారు. దీంతో క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరం తగ్గుతుంది. ప్రజలు ఈ సేవను ఉపయోగించుకోవాలన్నారు అధికారులు.


