News August 21, 2025
పంజాగుట్ట నిమ్స్‌లో ప్రపంచ సుందరి

ప్రతష్ఠాత్మక నిమ్స్‌లో చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగులను ప్రపంచ సుందరి ఓపల్ సుచాత పరామర్శించారు. ఇందులో అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. సదుపాయాలను డైరెక్టర్ డా.బీరప్ప వివరించారు. అనంతరం ఆమె ఆంకాలజీ బ్లాక్‌లో రోగులకు పండ్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో మెడికల్ ఆంకాలజీ వైద్యుడు డా.సదాశివుడు, మీడియా ఇన్‌ఛార్జి సత్యాగౌడ్ తదితరులు ఉన్నారు.
Similar News
News August 22, 2025
HYD: సెప్టెంబరు నుంచి 100 రోజుల అక్షరాస్యత ఉద్యమం

సెప్టెంబరు నుంచి100 రోజులపాటు అక్షరాస్యత ఉద్యమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ ఉద్యమం ప్రారంభం కానుంది. 15 ఏళ్ల వయసు దాటిన వారి కోసం ప్రత్యేకంగా 16 పాఠాలు ముద్రించి, అక్షర వికాసం కోసం ప్రభుత్వం కృషి చేయనుందని అధికారులు తెలిపారు.
News August 22, 2025
కూకట్‌పల్లి: సహస్ర హత్య.. పోలీసుల అదుపులో బాలుడు

సహస్ర హత్య కేసులో పక్క భవనంలో ఉన్న బాలుడే ఈ దారుణానికి వడిగట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే బాలుడిని అదుపులోకి తీసుకున్న ప్రత్యేక బృందాలు విచారణ చేపట్టారు. హత్య జరిగిన కూతవేటు దూరంలో ఉన్న పాఠశాలల్లోనే ఆ బాలుడు చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాలుడిని విచారణ చేయడంలో భాగంగా అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలను విచారణ అనంతరం తెలియజేస్తామని తెలిపారు.
News August 22, 2025
ఏలూరు జిల్లాలో బీజేపీ నేతలకు కీలక పదవులు

ఏలూరు జిల్లాకు చెందిన ఇద్దరు బీజేపీ నేతలకు పార్టీలో కీలక పదవులు లభించాయి. ఏలూరు నగరానికి చెందిన గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా, కొయ్యలగూడెంకు చెందిన బొల్లిన నిర్మల కిషోర్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ అధిష్ఠానం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.