News August 21, 2025
గోదావరి ఉద్ధృతికి అప్రమత్తంగా ఉండండి: ఖమ్మం MP

భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరిగి.. రెండో ప్రమాద హెచ్చరిక అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి సూచించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్న ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం గోదావరి నీటిమట్టం 50 అడుగులకు చేరిందన్న విషయం తెలుసుకొని జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు.
Similar News
News March 19, 2026
అనంత: రూ.1.30 కోట్లకు పైగా పంట నష్టం

అనంతపురం జిల్లాలో ఈదురుగాలుల తాకిడికి ఉద్యాన, వ్యవసాయ పంటలు చెల్లాచెదురైన పరిస్థితి నెలకొంది. కళ్యాణదుర్గం, కంబదూరు, శెట్టూరు, ఆత్మకూరు, గార్లదిన్నె, శింగనమల తదితర మండలాల్లో 65 ఎకరాలలో అరటి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. రూ.1.30 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. వరి, మొక్కజొన్నతో పాటు ఇతర ఉద్యాన పంటల నష్టం వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
News March 19, 2026
వనపర్తి DCC నూతన కార్యవర్గం ఖరారు

వనపర్తి జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC)లో పలువురు నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా పి.తిరుపతయ్య, సాయిచరణ్ రెడ్డి నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా పి.బ్రహ్మచారి, ధనలక్ష్మి, ఎల్.సతీష్, పి.కృష్ణారెడ్డి, గణేష్ గౌడ్, సత్య రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. అధికార ప్రతినిధులుగా ముగ్గురు ఎంపికయ్యారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నలుగురిని నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
News March 19, 2026
నెల్లూరు: కూటి కోసం ఎన్ని కష్టాలో..!

కూటి కోసం కోటి విద్యలు అంటారు పెద్దలు. నెల్లూరులో బుడ్డ గాంధీ తాతను చూస్తే నిజమే అనిపిస్తుంది. లీలా మహల్ సెంటర్ వద్ద ఓ బాలుడు ఇలా భిక్షాటన చేశాడు. అప్పటి గాంధీ బ్రిటిష్ వారిమీద పోరాటం చేస్తే.. నేటి గాంధీలు కడుపు నింపుకునేందుకు రోజుకో పోరాటం చేస్తున్నారు. ఈ బుడ్డ గాంధీకి కొందరు డబ్బులు ఇవ్వగా.. మరికొందరు చూసి నవ్వుకుంటూ వెళ్లిపోయారు.


