News August 21, 2025
SRSP వరద గేట్లను మూసేసిన అధికారులు

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీరు తగ్గడంతో గురువారం వరద గేట్లను మూసివేశారు. సోమవారం 40 గేట్లు ఓపెన్ చేసిన అధికారులు నిన్నటి నుంచి క్రమక్రమంగా అన్ని గేట్లను మూసివేశారు. కాగా ఉదయం 10.30 గంటలకు ఎగువ నుంచి ప్రాజెక్టుకు ఇన్ ఫ్లోగా 1.20 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇక ప్రాజెక్టులో తాజాగా 1089.60 అడుగుల (75.314TMC) నీటి మట్టం ఉన్నట్లు అధికారులు వివరించారు.
Similar News
News August 21, 2025
NZB: త్వరలో సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు: CP

జిల్లాలోని అన్ని శాఖలను సమన్వయం చేయడం కోసం సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. గురువారం కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో సీపీ మాట్లాడారు. ఈ కౌన్సిల్ భవిష్యత్తులో అన్ని రకాల సమస్యలపై తక్షణ పర్యవేక్షణ చేసి వాటి నివారణ కోసం జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
News August 21, 2025
జులైలో 1708 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు: CP

నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో జులై నెలలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు దాదాపు 1708 నమోదు చేసినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. ఈ కేసుల్లో 966 మంది నిందితులపై అభియోగాలు మోపుతూ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 77 కేసుల్లో జైలు శిక్ష విధించగా మిగతా కేసులలో జరిమానాలు విధించారని వివరించారు.
News August 20, 2025
ఆర్మూర్: మినీ స్టేడియాన్ని సందర్శించిన జిల్లా యువజన క్రీడాభివృద్ధి అధికారి

ఆర్మూర్ పట్టణంలోని మినీ స్టేడియం, ఇండోర్ స్టేడియాన్ని జిల్లా యువజన, క్రీడాభివృద్ధి అధికారి పవన్ కుమార్ ఈరోజు పరిశీలించారు. ఆర్మూర్ క్రీడాకారుల సౌకర్యార్థం క్రీడా మైదానాన్ని ఉన్నతీకరిస్తామన్నారు. త్వరలో క్రీడా మైదానంలో వాలీబాల్, కబడ్డీ, కోకో, ప్లే ఫీల్డ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫిజికల్ డైరెక్టర్లు గోపిరెడ్డి, మల్లేశ్ గౌడ్ పాల్గొన్నారు.