News August 21, 2025
HYDకు ఆగస్టు, సెప్టెంబర్ ‘FEVER’

జూన్, జులైలో వర్షపాతం అంతగా నమోదు కాకపోవడంతో డెంగ్యూ కేసులు సైతం అడపాదడప నమోదయ్యాయి. కాగా.. ఆగస్టు1 నుంచి వర్షాలు కురుస్తుండటంతో గత 10 రోజుల్లోనే గ్రేటర్‌లో 42 మంది డెంగ్యూ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. AUG, SEPలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. జనరల్ ఆస్పత్రులకు అత్యధికంగా జ్వరాలతో వస్తున్నవారే ఉంటుండంతో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రజలు పరిశుభ్రంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
Similar News
News March 12, 2026
వరంగల్: 19 రోజులే గడువు.. రూ.111.95 కోట్ల టార్గెట్

ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో 19 రోజులే గడువు మిగిలి ఉంది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పన్ను వసూళ్ల లక్ష్యం పూర్తి కాలేదు. 2025-26 ఆస్తి పన్ను రూ.81.58 కోట్లు ఉండగా, పాత బకాయితో కలిపి మొత్తం రూ.178.19 కోట్లు ఉంది. ఈ ఏడాది రూ.178.19 కోట్ల బకాయిలలో ఇప్పటి వరకు రూ.66.24 కోట్లు వసూలు చేయగా, రూ.111.95 కోట్ల బకాయి ఉంది. మరో 19 రోజులే గడువు ఉండటంతో, రోజుకు రూ.6 కోట్లు వసూలు చేస్తేనే బకాయి పూర్తవుతుంది.
News March 12, 2026
MBNR: మినీ ఎయిర్‌పోర్టుల్లా రైల్వే స్టేషన్లు..!

‘అమృత్ భారత్ స్టేషన్’ పథకం కింద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని రైల్వే స్టేషన్లు సరికొత్త రూపు సంతరించుకుంటున్నాయి. మహబూబ్‌నగర్ (₹39.82 కోట్లు), జడ్చర్ల (₹36.67 కోట్లు), గద్వాల (₹42.82 కోట్లు), జోగులాంబ (₹6.7 కోట్లు) నిధులతో పునరాభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. త్వరలోనే ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
News March 12, 2026
కృష్ణమ్మ చెంత.. ఇసుకాసురుల పంజా!

విజయవాడ-అవనిగడ్డ కరకట్ట వెంబడి <<19359993>>ఇసుక దోపిడీ<<>> జోరుగా సాగుతోంది. ఒక మీటరు తవ్వాలన్న నిబంధనను తుంగలో తొక్కి లోతుగా తవ్వేస్తుండగా, 20 టన్నుల సామర్థ్యం గల లారీల్లో 35 టన్నుల లోడుతో యథేచ్ఛగా తరలిస్తున్నారు. మైనింగ్ మంత్రి నియోజకవర్గంలోనే అక్రమాలు జరుగుతున్నా విజిలెన్స్ తనిఖీలు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అధికారుల అండదండలతోనే ప్రభుత్వ ఖజానాకు కోట్లలో గండి పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.


