News August 21, 2025
MHBD: జిల్లావ్యాప్తంగా మారిన వాతావరణం

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వాతావరణం ఒకసారిగా పొడిగా మారింది. వర్షపాతం దాదాపుగా అన్ని ప్రాంతాలలో తక్కువగా నమోదయింది. జిల్లా వ్యాప్తంగా కేవలం 12.4 మిల్లీమీటర్ల వర్షపాతం, సగటున 0.8 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయిందని జిల్లా అధికారులు తెలిపారు. కేవలం కొత్తగూడ 3.8, గంగారం 8.6 మిమీ మాత్రమే వర్షపాతం నమోదయింది.
Similar News
News March 24, 2026
చిత్తూరు: కన్నతండ్రిపై కుమారుడి దాడి

కన్న తండ్రిపై కుమారుడు దాడి చేసిన ఘటన పుంగనూరు మండలంలో చోటుచేసుకుంది. రాంనగర్‌కు చెందిన భాస్కర్ రాజు కుమారుడు గోవర్ధన్‌కు ఏడాది క్రితం వివాహం చేశారు. దంపతుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. సామరస్యంగా ఉండాలని సూచించడంతో కుమారుడు తండ్రిని ఇంటి నుంచి గెంటేశాడు. దీనిపై మళ్లీ పంచాయతీ పెట్టి, కోడలి పట్ల అనుకూలంగా మాట్లాడటంతో గోవర్ధన్ తండ్రిపై దాడి చేశాడు. క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు.
News March 24, 2026
అనంతలో గ్యాస్ కష్టాలు

అనంతపురం జిల్లా ప్రజలను గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. బుక్ చేసినా సకాలంలో డెలివరీ కాకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బుక్ చేసి పది రోజులవుతున్నా ఇంకా ఇంటికి చేరలేదని తాడిపత్రికి చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని, అధికారులు స్పందించి గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
News March 24, 2026
వరిలో రెల్లరాల్చు పురుగును ఎలా నివారించాలి?

వరి పంటను రెల్లరాల్చు పురుగు ఆశించి నష్టం కలిగిస్తుంది. ఈ పురుగు లార్వాలు గింజ గట్టిపడే దశలో కంకులను కత్తిరిస్తాయి. దీని వల్ల కంకులు రాలిపోతాయి. ఈ పురుగులు పగలు భూమిలో దాక్కొని రాత్రి వేళల్లో పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఈ పురుగుల ఉద్ధృతి తక్కువగా ఉంటే లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ.. ఉద్ధృతి ఎక్కువగా ఉంటే లీటరు నీటికి క్లోరంట్రనిలిప్రోల్ 0.3ml కలిపి సాయంత్రం వేళ పిచికారీ చేయాలి.


