News August 21, 2025

బాంబ్ సందేశం తెచ్చిన పావురం.. జమ్మూలో హైఅలర్ట్

image

భారత్-పాక్ సరిహద్దులోని ఆర్ఎస్ పురా ప్రాంతంలో ఓ పావురం కలకలం రేపింది. దాని కాలికి రానున్న రోజుల్లో ‘జమ్మూ స్టేషన్‌ను ఐఈడీతో బ్లాస్ట్ చేస్తాం’ అని రాసి ఉండటాన్ని BSF బలగాలు గుర్తించాయి. అలాగే ‘కశ్మీర్ మాది’ అనే స్లోగన్ సైతం ఉండటంతో జమ్మూలో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. జమ్మూ రైల్వే స్టేషన్‌ను తమ అధీనంలోకి తీసుకున్నాయి.

Similar News

News August 21, 2025

బైక్‌లకు టోల్ ఫీజు అని ప్రచారం.. కేంద్రం వివరణ

image

టోల్ ప్లాజాల వద్ద టూవీలర్లకు సైతం ఫీజు వసూలు చేస్తారనే వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై PIB FACTCHECK స్పందించింది. NHAI దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలలోని టోల్ ప్లాజాల్లో బైకర్ల నుంచి ఎలాంటి రుసుమును వసూలు చేయ‌ట్లేదని స్పష్టం చేసింది. ఇలాంటి ప్రతిపాదన కూడా లేదని, తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని కోరింది. 4 లేదా అంతకంటే ఎక్కువ చక్రాలు ఉన్న వాహనాలకే టోల్ ఉంటుందని తెలిపింది.

News August 21, 2025

క్యాప్సికం సాగుతో ఏటా రూ.4 కోట్లు సంపాదిస్తున్న MBA యువతి

image

MH పుణే కల్వాడి గ్రామానికి చెందిన యువతి ప్రణిత క్యాప్సికం సాగుతో ఏటా ₹4 కోట్ల టర్నోవర్ సాధిస్తోంది. MBA చదివి ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేసింది. తండ్రి సాయంతో 2020లో తమకున్న పొలంలో ₹20 లక్షల పెట్టుబడితో పాలీ హౌస్ సాగులో క్యాప్సికం పంట వేసింది. 4 నెలల్లో 40 టన్నుల పంట చేతికి రాగా, ₹12 లక్షల లాభం వచ్చింది. సాగును 25 ఎకరాలకు విస్తరించగా ఖర్చులన్నీ పోను ఏటా ₹2.25 కోట్ల లాభం పొందుతోంది.

News August 21, 2025

విశ్వంభరుడికి జన్మదిన శుభాకాంక్షలు: పవన్

image

మెగాస్టార్ చిరంజీవికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘చిరంజీవిగా ప్రేక్షక లోకాన్ని రంజింపచేసి ధ్రువతారగా వెలుగొందుతున్న మా అన్నయ్యకి హ్యాపీ బర్త్ డే(AUG 22). ఆయనకి తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం. ఆయన కష్టాన్ని చూస్తూ పెరగడం ఒక గొప్ప అనుభవం. నాలాంటి ఎందరికో ఆయన స్ఫూర్తి ప్రదాత. అన్నిటిని భరించే శక్తి ఆయన నైజం. అందుకే ఆయన విశ్వంభరుడు’ అని Xలో రాసుకొచ్చారు.