News August 21, 2025
ఏలూరు: వరద ముప్పు.. మూటాముళ్లే సర్దుకొని పయనం

ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు ఏజెన్సీ మండలాల్లో గోదావరి వరద ఉధృతి పెరగడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి పరిస్థితిని పరిశీలిస్తూ, ముంపు ప్రభావిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రేపాకుగోమ్ము గ్రామంలో నిర్వాసితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పంట పొలాలు, రహదారులు, వంతెనలు నీటమునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
Similar News
News August 21, 2025
BREAKING: ‘గో బ్యాక్ మార్వాడీ’.. నల్గొండలో రేపు మొబైల్ షాపుల బంద్

తెలంగాణలో ‘గో బ్యాక్ మార్వాడీ’ ఉద్యమం ఉద్ధృతమవుతోంది. స్థానిక వ్యాపారులపై గుజరాత్, రాజస్థాన్ మార్వాడీల దౌర్జన్యానికి నిరసనగా శుక్రవారం తెలంగాణ బంద్‌కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జేఏసీకి మద్దతుగా నల్గొండలో రేపు మొబైల్ షాపులు బంద్ చేస్తున్నామని మొబైల్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ఈరోజు ప్రకటించారు. అన్ని షాపులు మూసివేసి, బంద్‌ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
News August 21, 2025
అడ్డతీగల: ఇక్కడ విద్యార్థె టీచర్..?

అడ్డతీగల మండలం కొచ్చావారివీధి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు 10 రోజులుగా టీచర్ రావడం లేదని గ్రామస్థులు తెలిపారు. ఇక్కడ పని చేసే ఒక్క టీచర్‌ను అడ్డతీగల డిప్యూటేషన్ పై వెళ్లడంతో పాఠాలు బోధించే వారు లేరని అంటున్నారు. 11 మంది విద్యార్థులు ఉన్నారని ప్రతీరోజు పాఠశాలకు వచ్చి పోతున్నారని తెలిపారు. తోటి విద్యార్థి కాసేపు పాఠాలు చెబుతున్నాడన్నారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News August 21, 2025
ఆ ట్రస్ట్ సేవలు అభినందనీయం: కలెక్టర్

తాడేపల్లిగూడెం మండలం అలంపురంలోని ఓ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత హాస్పిటల్‌ను కలెక్టర్ నాగరాణి గురువారం సందర్శించారు. హాస్పిటల్ ద్వారా రోగులకు అందిస్తున్న చికిత్సల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హాస్పటల్లో వివిధ విభాగాలను, వైద్య పరికరాలను పరిశీలించి ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. హాస్పిటల్‌ను కొనుగోలు చేసిన నాలుగు ఎకరాల విస్తీర్ణాన్ని పరిశీలించారు.