News August 21, 2025
HYDలో అదీ ఇదీ ఒకేలా ఉన్నా.. వేర్వేరు..!

HYDలోని ఈ ప్రాంతాల పేర్లతో ఎప్పుడూ కన్ఫ్యూజన్‌లో పడుతుంటాం. అవి దిల్‌షుక్‌నగర్-దిల్‌ఖుష్‌నగర్, హయత్‌నగర్-హిమాయత్‌నగర్, తుర్కయంజాల్- దేవరయంజాల్, ప్రతాపసింగారం-బాటసింగారం-నస్దిక్‌సింగారం, కీసర-ఘట్‌కేసర్, గడ్డిఅన్నారం-తట్టిఅన్నారం, అంబర్‌పేట్- పెద్దఅంబర్‌పేట్, లింగంపల్లి-బాగ్‌లింగంపల్లి, హైదర్‌నగర్-హైదర్‌గూడ, IBP పోచారం-ఘట్కేసర్ పోచారంతోపాటు 3 బండ్లగూడలు. ఆకులమైలారం- దండుమైలారం ఇలా ఇంకేమైనా ఉన్నాయా?
Similar News
News March 24, 2026
చిత్తూరు: కన్నతండ్రిపై కుమారుడి దాడి

కన్న తండ్రిపై కుమారుడు దాడి చేసిన ఘటన పుంగనూరు మండలంలో చోటుచేసుకుంది. రాంనగర్‌కు చెందిన భాస్కర్ రాజు కుమారుడు గోవర్ధన్‌కు ఏడాది క్రితం వివాహం చేశారు. దంపతుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. సామరస్యంగా ఉండాలని సూచించడంతో కుమారుడు తండ్రిని ఇంటి నుంచి గెంటేశాడు. దీనిపై మళ్లీ పంచాయతీ పెట్టి, కోడలి పట్ల అనుకూలంగా మాట్లాడటంతో గోవర్ధన్ తండ్రిపై దాడి చేశాడు. క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు.
News March 24, 2026
అనంతలో గ్యాస్ కష్టాలు

అనంతపురం జిల్లా ప్రజలను గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. బుక్ చేసినా సకాలంలో డెలివరీ కాకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బుక్ చేసి పది రోజులవుతున్నా ఇంకా ఇంటికి చేరలేదని తాడిపత్రికి చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని, అధికారులు స్పందించి గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
News March 24, 2026
వరిలో రెల్లరాల్చు పురుగును ఎలా నివారించాలి?

వరి పంటను రెల్లరాల్చు పురుగు ఆశించి నష్టం కలిగిస్తుంది. ఈ పురుగు లార్వాలు గింజ గట్టిపడే దశలో కంకులను కత్తిరిస్తాయి. దీని వల్ల కంకులు రాలిపోతాయి. ఈ పురుగులు పగలు భూమిలో దాక్కొని రాత్రి వేళల్లో పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఈ పురుగుల ఉద్ధృతి తక్కువగా ఉంటే లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ.. ఉద్ధృతి ఎక్కువగా ఉంటే లీటరు నీటికి క్లోరంట్రనిలిప్రోల్ 0.3ml కలిపి సాయంత్రం వేళ పిచికారీ చేయాలి.


