News August 21, 2025
లిక్కర్ స్కాం: రాజ్ కసిరెడ్డి ఆస్తుల జప్తునకు అనుమతి

AP: మద్యం కుంభకోణం కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిందితుడు రాజ్ కసిరెడ్డి ఆస్తుల జప్తునకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆస్తులు జప్తు చేసేందుకు ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేయనుంది. మద్యం ద్వారా వచ్చిన అక్రమ ఆదాయంతో కసిరెడ్డి ఆస్తులు కొనుగోలు చేసినట్లు సీఐడీ అభియోగం మోపింది.
Similar News
News August 21, 2025
ఎమ్మెల్యే దగ్గుపాటికి సీఎం హెచ్చరిక

AP: ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకున్న అనంతపురం(U) MLA దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ CM చంద్రబాబుని కలిశారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై MLA నుంచి CM వివరణ తీసుకున్నారు. పద్ధతి మార్చుకోవాలని, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. TDPలో క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అటు <<17432318>>NTRను <<>>తాను దూషించలేదని, ఈ అంశంలో తనను ఇరికించారని MLA సంజాయిషీ ఇచ్చినట్లు సమాచారం.
News August 21, 2025
ఇంటర్ ప్రైవేటుగా రాసే విద్యార్థులకు ALERT

AP: కాలేజీకి వెళ్లకుండా ప్రైవేటుగా 2026లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇంటర్ బోర్డు కీలక సూచన చేసింది. హాజరు నుంచి మినహాయించేలా అనుమతి పొందడానికి AUG 22 నుంచి SEP 26 వరకు దరఖాస్తు చేయాలని సూచించింది. అలాగే సబ్జెక్టుల మినహాయింపు, గ్రూప్ మార్పు కోరుకునే విద్యార్థులు స్థానిక ప్రభుత్వ జూ.కాలేజీల్లో టెన్త్ సర్టిఫికెట్, TCలతో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. ఆ తర్వాతే పరీక్ష ఫీజు చెల్లించాలంది.
News August 21, 2025
భారత్‌తో విరోధం USకి మంచిది కాదు: నిక్కీ హేలీ

భారత్‌ను శత్రువుగా చూడటం ట్రంప్ విదేశాంగ పాలసీ స్ట్రాటజీల్లోనే బిగ్ డిజాస్టర్ అని US మాజీ రాయబారి నిక్కీ హేలీ పేర్కొన్నారు. ‘చైనా తరహాలో భారత్‌ని ప్రత్యర్థిగా కాదు.. మిత్ర దేశంలా చూడాలి. అన్ని విధాలుగా ఆసియా ఖండంలో చైనాకు చెక్ పెట్టగల సామర్థ్యం భారత్‌కే ఉంది. కమ్యూనిస్ట్స్ నియంత్రణలో నడిచే చైనాతో పోలిస్తే.. ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఎదుగుదల ప్రపంచానికి ఎలాంటి హానీ చేయదు’ అని వ్యాఖ్యానించారు.