News August 21, 2025
రూ.కోటి ప్రశ్నకు సమాధానం చెప్పగలరా?

‘కౌన్ బనేగా కరోడ్‌పతి- 17’లో ఉత్తరాఖండ్‌కు చెందిన IPS ఆదిత్య కుమార్ రూ.కోటి గెలుచుకుని సత్తాచాటారు. ఈ సీజన్‌లో ఈయనే తొలి కరోడ్‌పతి కావడం విశేషం. ఈ సందర్భంగా నెట్టింట ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి. రూ.కోటి ప్రశ్న ఇదే.. ‘మొదటి అణు బాంబు తయారీకి ఉపయోగించిన ప్లూటోనియం అనే మూలకాన్ని వేరుచేసిన శాస్త్రవేత్త పేరు మీద ఉన్న మూలకం ఏది? A. సీబోర్జియం, B. ఐన్‌స్టీనియం, C. మైట్‌నేరియం, D. బోహ్రియం. ANS ఏంటి?
Similar News
News August 21, 2025
బైక్‌లకు టోల్ ఫీజు అని ప్రచారం.. కేంద్రం వివరణ

టోల్ ప్లాజాల వద్ద టూవీలర్లకు సైతం ఫీజు వసూలు చేస్తారనే వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై PIB FACTCHECK స్పందించింది. NHAI దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలలోని టోల్ ప్లాజాల్లో బైకర్ల నుంచి ఎలాంటి రుసుమును వసూలు చేయట్లేదని స్పష్టం చేసింది. ఇలాంటి ప్రతిపాదన కూడా లేదని, తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని కోరింది. 4 లేదా అంతకంటే ఎక్కువ చక్రాలు ఉన్న వాహనాలకే టోల్ ఉంటుందని తెలిపింది.
News August 21, 2025
క్యాప్సికం సాగుతో ఏటా రూ.4 కోట్లు సంపాదిస్తున్న MBA యువతి

MH పుణే కల్వాడి గ్రామానికి చెందిన యువతి ప్రణిత క్యాప్సికం సాగుతో ఏటా ₹4 కోట్ల టర్నోవర్ సాధిస్తోంది. MBA చదివి ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేసింది. తండ్రి సాయంతో 2020లో తమకున్న పొలంలో ₹20 లక్షల పెట్టుబడితో పాలీ హౌస్ సాగులో క్యాప్సికం పంట వేసింది. 4 నెలల్లో 40 టన్నుల పంట చేతికి రాగా, ₹12 లక్షల లాభం వచ్చింది. సాగును 25 ఎకరాలకు విస్తరించగా ఖర్చులన్నీ పోను ఏటా ₹2.25 కోట్ల లాభం పొందుతోంది.
News August 21, 2025
విశ్వంభరుడికి జన్మదిన శుభాకాంక్షలు: పవన్

మెగాస్టార్ చిరంజీవికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘చిరంజీవిగా ప్రేక్షక లోకాన్ని రంజింపచేసి ధ్రువతారగా వెలుగొందుతున్న మా అన్నయ్యకి హ్యాపీ బర్త్ డే(AUG 22). ఆయనకి తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం. ఆయన కష్టాన్ని చూస్తూ పెరగడం ఒక గొప్ప అనుభవం. నాలాంటి ఎందరికో ఆయన స్ఫూర్తి ప్రదాత. అన్నిటిని భరించే శక్తి ఆయన నైజం. అందుకే ఆయన విశ్వంభరుడు’ అని Xలో రాసుకొచ్చారు.