News August 21, 2025

రూ.400 కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా!

image

TG: ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. HYD మాదాపూర్ జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో పార్కులతో పాటు రహదారుల ఆక్రమణలను తొలగించింది. GHMCకి గిఫ్ట్ డీడ్ చేసిన పార్కులను జైహింద్ రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశారన్న ఎన్‌క్లేవ్ ప్రతినిధుల ఫిర్యాదుతో క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేపట్టింది. కబ్జాకు గురైన 16వేల గజాల స్థలాన్ని పరిరక్షించింది. వీటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. వీటి విలువ రూ.400 కోట్లని సమాచారం.

Similar News

News April 1, 2026

విమాన ఇంధన ధరకు రెక్కలు.. పెరగనున్న టికెట్ రేట్లు

image

విమానం ఇంధనం ధరలు ఆకాశాన్నంటాయి. కిలో లీటర్(1000 లీటర్లు) ఫ్లైట్ ఆయిల్ ధర రికార్డ్ స్థాయిలో రూ.2,07,341కి చేరింది. గతంలో కిలో లీటర్‌కు రూ.96,638 ఉండగా ఏకంగా రెట్టింపు ధర పెరగడం గమనార్హం. జెట్ ఫ్యూయల్ ధర రూ.2 లక్షల మార్కు దాటడం ఇదే తొలిసారి. ఇక మొత్తంగా గత నెలతో పోలిస్తే ఇంటర్నేషనల్ విమానాల ఫ్యూయల్ ధర 115%, డెమిస్టిక్‌లో 107% పెరిగింది. దీంతో విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగే అవకాశముంది.

News April 1, 2026

కుప్పకూలిన విమానం.. 29 మంది మృతి

image

రష్యా సైనిక రవాణా విమానం కుప్పకూలింది. ఈస్ట్ యూరప్‌లోని క్రిమియాలో ఓ కొండను ఫ్లైట్ ఢీకొట్టిన ఘటనలో 29 మంది చనిపోయారు. మృతుల్లో ఆరుగురు సిబ్బంది, 23 మంది ప్రయాణికులు ఉన్నారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 1, 2026

అకౌంట్‌లో ₹44, చేతిలో ₹40.. బరిలో 26ఏళ్ల అమ్మాయి!

image

కేరళంలోని ఎట్టుమనూర్‌లో ఆశ్నా థంపి అనే 26ఏళ్ల జర్నలిస్ట్ ఎన్నికల బరిలోకి దిగడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. తనకు ఆస్తులేం లేవని.. ₹40 క్యాష్, బ్యాంక్ అకౌంట్‌లో ₹44 ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొనడమే ఇందుకు కారణం. SUCI(C) పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఆమె కేరళం ఎన్నికల బరిలో ఉన్న అత్యంత పేద అభ్యర్థిగా నిలిచారు. ప్రజాస్వామ్యంలో డబ్బు కంటే ప్రజల సమస్యలే ముఖ్యమని ఆశ్నా చెబుతున్నారు. <<-se>>#Elections2026<<>>