News August 21, 2025
బీచ్ రోడ్డు: బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకో బాస్..!

బీచ్ రోడ్డులో సబ్‌మెరిన్ వద్ద అర్ధరాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. పూర్ణ మార్కెట్ ప్రాంతానికి చెందిన కె.సాగర్(26) స్నేహితుడితో కలిసి పార్క్ హోటల్ నుంచి RK బీచ్ వైపు బైక్‌పై వస్తున్నాడు. ముందు ఉన్న బైక్ యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో ఆ వాహనాన్ని వీరు ఢీకొట్టి పడిపోయారు. హెల్మెట్ లేకపోవడంతో సాగర్ తలకు తీవ్రగాయమై చికిత్స పొందుతూ గంట వ్యవధిలో మరణించాడు. త్రిటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News August 21, 2025
మల్కాపురం: మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

మల్కాపురంలో ఓ వ్యక్తి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. వెంకన్నపాలెంలో ఉంటున్న కనకరాజు మద్యానికి బానిసయ్యాడు. ఈ మధ్య కాలంలోనే అతని భార్యకు ఆపరేషన్ అయింది. అప్పటి నుంచి ఆమె పుట్టింటిలోనే ఉంటోంది. దీంతో ఒంటరితనం భరించలేక మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News August 21, 2025
స్టీల్‌ప్లాంట్‌లో క్యాంటీన్ల మూసివేతకు కారణం ఇదేనా?

ఓ లేఖ..స్టీల్‌ప్లాంట్‌లో ప్రైవేట్ <<17470374>>క్యాంటీన్లు మూసివేత<<>>కు కారణంగా తెలుస్తోంది. ఓ మాజీ యూనియన్ నాయకుడు ఉక్కుమంత్రిత్వశాఖకు ఆ లేఖ రాసినట్లు సమాచారం. క్యాంటీన్ నిర్వహకులు ఉచితంగా కరెంటు,నీరు వాడుకుంటూ అనాధికార క్యాంటీన్లతో ఉక్క యాజమాన్యానికి రూ.కోట్లలో నష్టం వస్తోందని ఆ లేఖలో పేర్కొన్నట్లు వార్తలొస్తున్నాయి. దీంతో ఉక్కుమంత్రిత్వశాఖ నుంచి CMDకి ఆదేశాల రావడంతో నిర్వాహకులకు నోటీసులు ఇస్తున్నట్లు సమాచారం.
News August 21, 2025
విశాఖ: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్

ఆల్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లాలో మెంటాడకు చెందిన బొడ్డు తిరుపతి (25), గొట్టాపు నాగేంద్రబాబు (25), రాపర్తి నాగేశ్వరరావు(25)ను అరెస్టు చేసి వారి నుంచి 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేయగా.. బుధవారం ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.