News August 21, 2025
మేడారం మహా జాతరకు రూ.150 కోట్లు

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహా జాతరను మరింత వైభవంగా, భక్తుల సౌకర్యార్థం నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.150 కోట్లను బుధవారం మంజూరు చేసింది. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరిగే ఈ జాతర నిర్వహణకు, మౌలిక వసతుల అభివృద్ధికి ఈ నిధులను ఉపయోగించనున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ పూజారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News March 15, 2026
ఇదే ఊపు కొనసాగుతుంది: రోహిత్ శర్మ

భారత క్రికెట్ గత రెండేళ్లుగా సాధిస్తున్న విజయాలపై రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. ముంబైలో మహిళల జట్టు WC నెగ్గడం, ఇటీవల మెన్స్ T20 WCను కైవసం చేసుకోవడం అద్భుతమని కొనియాడారు. ‘ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడటం ఉండదు’ అని ధీమా వ్యక్తం చేశారు. పురుషుల, మహిళల జట్లు రెండూ ప్రస్తుతం ఫుల్ ‘మొమెంటం’లో ఉన్నాయని, ఇదే ఊపు భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
News March 15, 2026
పదో తరగతి పరీక్షల కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ

నంద్యాల జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు. 130 పరీక్ష కేంద్రాల వద్ద పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్షా పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సిబ్బందితో భద్రత, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
News March 15, 2026
ఏలూరు: పండుగలు వస్తున్నాయ్.. కందిపప్పు ఇవ్వరా?

చౌకధరల దుకాణాల్లో పేదలకు ఇవ్వాల్సిన కందిపప్పు పంపిణీ ఏడాదికి పైగా నిలిచిపోయింది. ఏలూరు జిల్లాలో 1164 డిపోలలో 6.40 లక్షల కార్డుదారులు ఉండగా వారిలో ఎక్కువ మంది రేషన్ సరకులపైనే ఆధారపడుతున్నారు. ఉగాది,రంజాన్ ,శ్రీరామనవమి పండగల సమయంలోనూ కందిపప్పు ఇవ్వకపోవడంతో కార్డుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చౌక దుకాణాల్లో కేజీ.రూ.67 ఉండగా.. బహిరంగ మార్కెట్లో కందిపప్పు రూ.120 నుంచి 140గా ఉంది.


