News April 1, 2024

ముంబైకి బిగ్ షాక్

image

హోం గ్రౌండ్(వాంఖడే)లో రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచులో ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. తాను ఆడిన తొలి బంతికే రోహిత్ శర్మ డకౌట్ అయ్యారు. దీంతో స్టేడియం అంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది. ఆ తర్వాత నమన్ ధీర్ కూడా తొలి బంతికే ఎల్‌బీగా వెనుదిరిగారు. మూడో ఓవర్లో బ్రెవిస్ కూడా గోల్డెన్ డకౌట్ అయ్యారు. ఈ ముగ్గురినీ RR బౌలర్ బౌల్ట్ ఔట్ చేశారు. స్కోర్: 2.2 ఓవర్లలో 14/3.

Similar News

News March 25, 2026

యుద్ధం.. కొనసాగుతున్న ఆల్ పార్టీ మీటింగ్

image

పశ్చిమాసియా యుద్ధంపై కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ అధ్యక్షతన పార్లమెంట్ భవనంలో ఆల్ పార్టీ మీటింగ్ కొనసాగుతోంది. INC, BJD, SP, CPM తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ భారత్‌పై యుద్ధ ప్రభావాన్ని వివరించారు. ప్రతిపక్ష నేతలు లేవనెత్తిన సందేహాలకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సమాధానాలిస్తున్నారు. ఇంధన సంక్షోభం నేపథ్యంలో ఈ పార్టీ మీటింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది.

News March 25, 2026

రామ్ చరణ్‌కు గాయం.. స్పందించిన ‘పెద్ది’ టీమ్

image

పెద్ది సినిమా షూటింగ్‌లో హీరో రామ్ చరణ్‌కు గాయమైందనే వార్తలపై మేకర్స్ స్పందించారు. ‘సెట్స్‌లో రామ్ చరణ్ ఎడమ కన్నుకు చిన్న గాయమైంది. చిన్న హెల్త్ ప్రొసీజర్ జరిగింది. ఇప్పుడు ఆయన క్షేమంగానే ఉన్నారు. రేపు షూటింగ్‌కు హాజరవుతారు. షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవు’ అని పెద్ది టీమ్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం అంతా కంట్రోల్‌లోనే ఉందని, ఆందోళన అవసరం లేదని తెలిపింది.

News March 25, 2026

రాజమండ్రిలో పోలవరం ప్రాజెక్టు ఆఫీసు ప్రారంభం

image

AP: రాజమండ్రిలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (PPA) ప్రధాన కార్యాలయం ఏర్పాటైంది. ఈ ఆఫీసును కేంద్ర జల శక్తి కార్యదర్శి వీఎల్ కాంతారావు ప్రారంభించారు. తర్వాత పోలవరం పనులను పరిశీలించి, అధికారులతో ఆయన సమీక్షించారు. కాగా ఇప్పటివరకు PPA ప్రధాన ఆఫీసు హైదరాబాద్‌లో ఉండేది.