News August 21, 2025
ఆకివీడు మండలంలో డీపీవో పర్యటన

జిల్లా పంచాయతీ అధికారి రాంనాథ్ రెడ్డి గురువారం ఆకివీడు మండలంలో పర్యటించారు. సిద్దాపురం, తరటావా, ఐ.భీమవరం, మందపాడు గ్రామాలలో పారిశుధ్య పనులను పరిశీలించారు. తరటావాలోని తాగునీటి చెరువుకు క్లోరినేషన్ చేయాలని ఆదేశించారు. సుమిత్ర సర్వే పురోగతిని సమీక్షించి, సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు.
Similar News
News August 21, 2025
ఆ ట్రస్ట్ సేవలు అభినందనీయం: కలెక్టర్

తాడేపల్లిగూడెం మండలం అలంపురంలోని ఓ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత హాస్పిటల్‌ను కలెక్టర్ నాగరాణి గురువారం సందర్శించారు. హాస్పిటల్ ద్వారా రోగులకు అందిస్తున్న చికిత్సల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హాస్పటల్లో వివిధ విభాగాలను, వైద్య పరికరాలను పరిశీలించి ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. హాస్పిటల్‌ను కొనుగోలు చేసిన నాలుగు ఎకరాల విస్తీర్ణాన్ని పరిశీలించారు.
News August 21, 2025
ఎన్టీఆర్ పెన్షన్ల పున: పరిశీలనకు అవకాశం: పీడీ

పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్టీఆర్ పెన్షన్ పరిశీలనలో అనర్హులుగా నోటీసులు అందుకున్న వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని డీఆర్‌డీఏ పీడీ వేణుగోపాల్ తెలిపారు. అనర్హులుగా గుర్తించిన 1904 మంది దివ్యాంగులలో, 1289 మందిని వృద్ధాప్య పెన్షన్లుగా మార్చినట్లు ఆయన పేర్కొన్నారు. పెన్షన్ రద్దయిన వారు నోటీసుతో పాటు సదరం సర్టిఫికెట్‌ను సమర్పించి పునఃపరిశీలన కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
News August 20, 2025
భీమవరం: వినాయక చవితి ఉత్సవాలపై కలెక్టర్ సమీక్ష

వినాయక చవితి ఉత్సవాలను పకడ్బందీగా అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లాలో సజావుగా ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలు నిషేధించామని, ఊరేగింపులో డీజే సౌండ్ సిస్టం వినియోగించరాదన్నారు.