News August 21, 2025
కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు మొదలు: జగదీశ్ రెడ్డి

TG: కాంగ్రెస్ పాలనలో రైతులకు <<17461451>>కష్టాలు<<>> మొదలయ్యాయని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. యూరియా కోసం రోడ్లెక్కి, అధికారుల కాళ్లు మొక్కే పరిస్థితి వచ్చిందన్నారు. ఢిల్లీ కాళ్లు మొక్కి టికెట్లు తెచ్చుకునే నేతలు, ప్రజలకు అదే అలవాటు చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కొందరు మంత్రులు, దళారులు కుమ్మక్కై రైతులకు ఈ దుస్థితి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News August 21, 2025
BREAKING: రాష్ట్రంలో విషాదం

AP: ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. రాజంపేట(మం) బాలరాజుపల్లిలో చెయ్యేరు నదిలో 8 మంది విద్యార్థులు ఈతకు వెళ్లగా, ముగ్గురు ఇసుక ఊబిలో చిక్కుకుని చనిపోయారు. మృతులు స్థానిక కాలేజీలో MBA చదువుతున్న దిలీప్, చంద్రశేఖర్, కేశవగా గుర్తించారు. నిన్న కర్నూలు (D) ఆస్పరి (M) చిగిలిలో నీటి కుంటలో ఈతకు వెళ్లిన <<17465047>>ఆరుగురు <<>>చిన్నారులు మృతిచెందారు.
News August 21, 2025
రైతు బతుకును బజారున పడేశావు: KTR

TG: బస్తా యూరియా కోసం రైతు బతుకును బజారున పడేశావంటూ CM రేవంత్‌పై KTR ఫైర్ అయ్యారు. యూరియా కోసం చెప్పుల వరసలో రైతు పడుకున్న ఫొటో షేర్ చేశారు. ‘ఈ ఫొటోను ఫ్రేమ్ కట్టించుకుంటావో, మెడలో వేసుకుని ఊరేగుతావో నీ ఇష్టం. అన్నదాతను అప్పులపాలు చేసిన చేతకాని పాలకులను చూశాం. కానీ చెప్పులపాలు చేసిన రికార్డు నీదే. కడుపు నింపే రైతును పాదరక్షల పాల్జేసిన నీ పాపం ఊరికే పోదు. జై కిసాన్ జై తెలంగాణ’ అని పోస్ట్ చేశారు.
News August 21, 2025
పాక్‌తో మ్యాచ్.. BCCIపై ఫ్యాన్స్ ఫైర్

ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచులు ఖరారైనట్లే. <<17474721>>క్రీడాశాఖ<<>> కూడా పరోక్షంగా ఒప్పుకుంది. దీంతో BCCIపై SMలో విమర్శలొస్తున్నాయి. ‘BCCIకి జవాన్ల త్యాగాలు, మన మనోభావాలతో పనిలేదు. డబ్బులొస్తే చాలు. అమరవీరుల సమాధులపై మీరు క్రికెట్ ఆడతామంటున్నారు. నీళ్లు-రక్తం కలిసి ప్రవహించలేవు. కానీ BCCI కోసం రక్తం-డబ్బు కలిసి ప్రవహిస్తాయి. మీరు డబ్బుకోసం పాక్‌తో ఆడినా.. మేము ఆ మ్యాచులు చూడం’ అంటూ పోస్టులు పెడుతున్నారు.