News August 21, 2025
గూడూరు: ప్రాణాల మీదికి తెచ్చిన యూరియా

గూడూరు మండలంలో యూరియా దొరకకపోవడంతో మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన అజ్మీర బిచ్చు నాయక్ కురవి మండలంలో చింతపల్లిలో యూరియా లభిస్తుందని సమాచారం తెలుసుకున్నారు. చింతపల్లి వెళ్లిన రైతుకు ఆ ఒక్క యూరియా బస్తా ప్రాణాల మీదికి తెచ్చింది. యూరియా లభించడంతో రైతు తిరిగి ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 18, 2026
3వేల డీజిల్ బస్సులు ఈవీలుగా..: CM

TG: హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం తిరుగుతున్న 3వేల డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే పెట్రోల్‌తో నడిచే ఆటోలనూ ఈవీలుగా మార్చే కార్యాచరణ చేపడుతున్నామన్నారు. కోర్ సిటీలోని పరిశ్రమలను నగరం వెలుపలకు తరలిస్తామని చెప్పారు. కోర్ సిటీలో సర్వీస్ సెక్టార్ మాత్రమే ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు.
News March 18, 2026
JNTUH-UAM ముక్కోణపు సహకారానికి LOI ప్రారంభం

జర్మనీకి చెందిన UAM ప్రతినిధి బృందం బుధవారం JNTUHను సందర్శించి ఉపకులపతి డాక్టర్ టి. కిషన్ కుమార్‌తో భేటీ అయ్యారు. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ విభాగాల్లో నాలుగేళ్ల బ్యాచిలర్ ప్రోగ్రామ్‌ల కోసం JNTUH, UAM మరియు అనుబంధ కళాశాలల మధ్య ముక్కోణపు సహకారానికి (LOI) అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విద్యావకాశాలు లభించనున్నాయి.
News March 18, 2026
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఉండాల్సిందే.. లేదంటే రద్దే

రంగారెడ్డి జిల్లాలో కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో లబ్ధిదారులు ఈనెల 31లోపు నివాసం ఉండాలని, లేనిపక్షంలో కేటాయింపులు రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ఖాళీగా ఉన్న ఇళ్లను ఏప్రిల్ మొదటి వారంలో కొత్తవారికి కేటాయిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని RDO, MROలను కలెక్టర్ ఆదేశించారు.


