News August 21, 2025

బధిరులకు ఉచిత మొబైల్ ఫోన్లు: ఏపీ ప్రభుత్వం

image

AP: మూగ, చెవిటి(బధిరులు) వారికి ఉచితంగా మొబైల్ ఫోన్లు(స్మార్ట్) ఇవ్వనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కామరాజు తెలిపారు. రూ.3 లక్షల లోపు వార్షిక ఆదాయం, ఇంటర్ విద్యార్హత, 18 ఏళ్ల వయసు, 40శాతం వైకల్యం, సైన్ లాంగ్వేజ్ వచ్చినవారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు www.apdascac.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News March 8, 2026

దేశంలో మరో UT ఏర్పాటంటూ వార్తలు.. ఖండించిన కేంద్రం

image

WBలోని సిలిగుడి కారిడార్ సమీపంలో కొత్త కేంద్ర పాలిత ప్రాంతం(UT) ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఓ వార్త వైరలవుతోంది. ఇందులో బిహార్‌, బెంగాల్‌లోని 6 జిల్లాలు ఉంటాయంటూ పలువురు పోస్టులు చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని PIB Fact Check ఖండించింది. కాగా ఈశాన్య రాష్ట్రాలకు రోడ్డు, రైలు మార్గాలు సిలిగుడి నుంచే వెళ్తాయి. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, చైనాకు ఇది సమీపంలో ఉండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

News March 7, 2026

‘విజయ’ బ్రాండ్‌తో కల్తీ.. AP డెయిరీపై ఆరోపణలు

image

TG: AP విజయ డెయిరీ తీరుపై తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అమిత్ రెడ్డి మండిపడ్డారు. అక్కడి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీలు ఇవ్వడంతో మార్కెట్లోకి కల్తీ పాలు, నెయ్యి వస్తున్నాయని ఆరోపించారు. మేఘనా ఫుడ్స్ తయారు చేస్తున్న నెయ్యిలో వెజిటెబుల్ ఆయిల్ ఉన్నట్లు తెలిపారు. దీనివల్ల తెలంగాణ పాడి రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నారు. AP ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

News March 7, 2026

రేపే ఫైనల్.. విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే?

image

అహ్మదాబాద్ వేదికగా రేపు భారత్-న్యూజిలాండ్ మధ్య T20WC ఫైనల్ జరగనుంది. దీంతో ప్రైజ్ మనీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ టోర్నీ కోసం ICC మొత్తం ₹120Crను కేటాయించింది. విజేతకు ₹27.48Cr, రన్నరప్‌కు ₹14.65Cr అందుతాయి. సెమీస్‌లో ఓడిన SA, ENGకు ₹7.24Cr చొప్పున, సూపర్-8 వరకు వచ్చిన జట్లకు ₹3.48Cr, టోర్నీలో పాల్గొన్న 20 టీమ్స్‌కు ₹2.29Cr చొప్పున ఇవ్వనుంది.
* రేపటి మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.