News August 21, 2025
HYD: వచ్చే నెల నుంచి తీరనున్న ప‘రేషన్’

గ్రేటర్ HYD పరిధిలో కొత్తరేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 69 వేలకుపైగా కార్డులను ఈ నెల చివరి నాటికి లబ్ధిదారులకు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో లక్షకుపైగా మార్పులు చేర్పులు జరిగాయి. వచ్చే సెప్టెంబర్ నుంచి కొత్తరేషన్ కార్డులందరికీ రేషన్ బియ్యం అందించనున్నట్టుగా సీఆర్‌వో అధికారి ముజమిల్ ఖాన్ తెలిపారు.
Similar News
News March 20, 2026
NTR: పీజీ పరీక్షల రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో NOV 2025లో నిర్వహించిన ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంసీఏ 3వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 1లోపు ఒక్కో పేపరుకు రూ.1,000 ఫీజు http://www.onlinesbi.com/లో చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం సూచించింది.
News March 20, 2026
ధాన్యం సేకరణ కోసం రూ.22,700 కోట్లు

TG: యాసంగిలో రైతుల నుంచి ధాన్యం సేకరణకు ప్రభుత్వం నిధులను సిద్ధం చేసింది. దీని కోసం రూ.22,700 కోట్లను పౌరసరఫరాల సంస్థ ఖాతాలో రుణం రూపేణా జమ చేయించింది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఈ రుణాన్ని ఇప్పించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రుణానికి గ్యారంటీ ఇస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో యాసంగిలో రైతుల నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా 95L MT ధాన్యాన్ని సేకరించనున్నారు.
News March 20, 2026
కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. నోటిఫై చేసిన కేంద్రం

FY 2026-27 APR 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్‌ను కేంద్రం నోటిఫై చేసింది. ఇందులో భాగంగా HYD, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్ నగరాలను మెట్రో జాబితాలో చేర్చి HRA మినహాయింపును 50%కి పెంచడం విశేషం. దీని ద్వారా రెంట్‌లో ఎక్కువ భాగాన్ని ట్యాక్స్ ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ట్రాన్స్‌పరెన్సీ పెంచేలా క్యాపిటల్ గెయిన్స్, NRI పన్ను నిబంధనలను కూడా ప్రభుత్వం కఠినతరం చేసింది.


