News August 21, 2025
కడప జిల్లాలో 81 మంది MPEOలు బదిలీ

కడప జిల్లా వ్యవసాయ శాఖలో పనిచేసే 81 మంది మల్టీ పర్పస్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ (MPEO)లను బదిలీ చేశారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్రనాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని పని సర్దుబాటు కోసం బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరిలో కొందరిని ఒక మండలం నుంచి మరొక మండలానికి, మరి కొందరిని ఒక డివిజన్ నుంచి వేరే డివిజన్ కు బదిలీ చేశారు. వీరు గ్రామాల్లో రైతులకు సహాయంగా RSKల్లో ఉంటారు.
Similar News
News March 12, 2026
రేపు కడపకు రానున్న గవర్నర్

రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈనెల 13న కడపకు రానున్నారు. YVU జరగనున్న స్నాతకోత్సవానికి ఆయన ఛాన్స్‌లర్ హోదాలో ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. విజయవాడ నుంచి హెలికాప్టర్లో కడప విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడి నుంచి కార్యక్రమం జరిగే వేదిక చేరుకొంటారు. అనంతరం తిరిగి ఆయన విజయవాడకు ప్రత్యేక హెలికాప్టర్‌లో వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
News March 12, 2026
గ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కడప ఎస్పీ

వంట గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడప ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ నకిలీ ప్రకటనలు ఇచ్చి వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా ఫేక్ లింకులు పంపించి మోసం చేస్తున్నారని తెలిపారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా అధికారిక గ్యాస్ ఏజెన్సీల ద్వారానే బుకింగ్ చేసుకోవాలని సూచించారు.
News March 12, 2026
కడపలో రైతులకు రైతులే మార్గదర్శకులు: కలెక్టర్

జిల్లాలో వ్యవసాయ రంగంలో వినూత్నంగా అమలు చేస్తున్న “ఛాంపియన్ రైతుల ఎంపిక విధానం” గురించి కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సీఎంకి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 361 రైతు సేవా కేంద్రాల పరిధిలో ప్రతి గ్రామంలో ఎక్కువగా పండించే పంటలో నైపుణ్యం కలిగిన 361 మంది రైతులను ఆదర్శ రైతులుగా (ఛాంపియన్లు) గుర్తించినట్లు తెలిపారు. రైతులకు పంటల సాగు విధానలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.


