News August 21, 2025
JANలో ‘దేవర-2’ షూట్.. ఆ తర్వాతే వేరే మూవీ!

‘దేవర-2’ సినిమా అటకెక్కిందని వస్తోన్న ప్రచారం ఫేక్ అని సినీవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు వెల్లడించాయి. అన్నీ కుదిరితే జనవరి నుంచి షూట్ మొదలు పెట్టేలా ప్లాన్ చేస్తున్నారని, ఇది పూర్తయ్యాకే మిగతా సినిమాలపై దృష్టి పెడతారని చెప్పాయి. కాగా ‘దేవర-2’ 2027 సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News August 21, 2025
చైనాను నమ్మొచ్చా?

అమెరికా టారిఫ్స్‌కు వ్యతిరేకంగా <<17476240>>భారత్-చైనా<<>> దగ్గరవుతున్నాయి. తమ దేశంలో వస్తువులను అమ్ముకోవచ్చని చైనా ఆహ్వానించింది. అయితే చైనాను అంత తేలిగ్గా నమ్మవద్దని అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం. అమెరికాను దాటి ప్రపంచ నం.1 అయ్యేందుకు చైనా ఏమైనా చేస్తుందని, ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ పాక్‌కు సపోర్ట్ చేసిందని గుర్తు చేస్తున్నారు. అయితే చైనాతో సఖ్యతతో ఉంటూనే USను దూరం చేసుకోవద్దంటున్నారు. దీనిపై మీ COMMENT?
News August 21, 2025
రేపు తెలంగాణ బంద్.. పెరుగుతున్న మద్దతు

TG: మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా OU జేఏసీ పిలుపునిచ్చిన రేపటి <<17475943>>తెలంగాణ బంద్‌కు<<>> మద్దతు పెరుగుతోంది. యాదాద్రి జిల్లా వ్యాపారులు రేపు షాపులు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. నారాయణపేట జిల్లాలోని మక్తల్ సహా నల్గొండ జిల్లాలోని హాలియా, దేవరకొండలో బంద్ పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. మార్వాడీలు నాసిరకం సామగ్రిని తక్కువ ధరకు అమ్ముతూ కస్టమర్లను, లోకల్ వ్యాపారస్థులను నష్టపరుస్తున్నారని ఆరోపించారు.
News August 21, 2025
శ్రీశైలం పవిత్రతను దెబ్బతీసే కుట్రలు: రాజాసింగ్

శ్రీశైలంలో దాదాపు అన్ని దుకాణాలను ముస్లింలు, క్రిస్టియన్స్ ఆక్రమించారని TG MLA రాజాసింగ్ ఆరోపించారు. ‘శ్రీశైలం పుణ్యక్షేత్రం పవిత్రతను దెబ్బతీయడానికి ఎప్పట్నుంచో కుట్రలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం ఓట్ బ్యాంక్ కోసం ముస్లింలు, క్రైస్తవులను అక్కడ స్థిరపరిచింది. ఈ విషయం CM చంద్రబాబు, పవన్‌కు తెలీదా? ఎందుకు వారిని తొలగించట్లేదు? అలాంటి వారిని వెంటనే సున్నిపెంటకు తరలించాలి’ అని విజ్ఞప్తి చేశారు.