News August 21, 2025
వనపర్తి జిల్లాలో రెండు కేంద్రాల్లో స్వల్ప వర్షం.. 12 కేంద్రాల్లో ‘0’నమోదు

వనపర్తి జిల్లాలో గత 24 గంటల్లో (నిన్న ఉదయం 8:30 నుంచి ఈరోజు ఉదయం 8:30 వరకు) 2 కేంద్రాలలో స్వల్ప వర్షపాతం నమోదు కాగా, 12 కేంద్రాల్లో ‘0’ వర్షపాతం రికార్డయింది. రేవల్లిలో 1.4 మి.మీ., గోపాల్పేటలో 0.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు సీపీఓ భూపాల్ రెడ్డి తెలిపారు. కొద్ది రోజులుగా వర్షాలతో ఇబ్బంది పడ్డ ప్రజలు 24 గంటలు తెరపి ఇవ్వడంతో కొంత ఊరటగా భావిస్తున్నారు.
Similar News
News March 14, 2026
కామారెడ్డి: ఒకేషనల్ పరీక్షలకు 91.37 శాతం హాజరు

కామారెడ్డి జిల్లాలో శనివారం నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సర ఒకేషనల్ పరీక్షలకు 91.37 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. మొత్తం 1,738 మంది విద్యార్థులకు గాను 1,588 మంది హాజరు కాగా, 150 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షలు పకడ్బందీగా, నిబంధనల ప్రకారం జరిగాయని ఆయన వివరించారు.
News March 14, 2026
ఉమ్మడి జిల్లాలో గ్యాస్ కొరత లేదు: కలెక్టర్

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్యాస్ కొరత లేదని జిల్లా కలెక్టర్ రాజబాబు శనివారం తెలిపారు. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, గ్యాస్ కొరత సృష్టించినా, అక్రమ నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని నిర్వాహకులకు హెచ్చరించారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఏర్పడితే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 1077 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని వినియోగదారులకు సూచించారు.
News March 14, 2026
MHBD: పరీక్ష కోసం తల్లిదండ్రుల మరణ వార్తను దాచారు!

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గన్యచక్ర తండాకు చెందిన <<19379355>>సోములు, మంగమ్మ దంపతులు HYD పటాన్‌చెరులో హత్య<<>>కు గురైన విషయం తెలిసిందే. కాగా హత్యకు గురైన తల్లిదండ్రుల విషయం తెలిస్తే బాలిక పరీక్షపై ప్రభావం పడుతుందని భావించిన గ్రామస్థులు, పరీక్ష పూర్తయ్యే వరకు విషయం ఆమెకు చెప్పకుండా దాచారు. పరీక్ష ముగించుకుని ఇంటికి వచ్చిన బాలికకు విషయం తెలిసి కన్నీరుమున్నీరయ్యింది.


