News August 21, 2025

తప్పులు లేని ఓటర్ జాబితాను తయారు చేయండి: కలెక్టర్

image

పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఎన్నికల అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులకు కలెక్టర్ టీఎస్ చేతన్ సమావేశం నిర్వహించారు. ఎన్నికలు సజావుగా జరగడానికి రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు సూచనలు తెలపాలని కోరారు. బూత్ లెవెల్ ఏజెంట్లను గుర్తించి ఓటరు జాబితాలో తప్పులు ఉంటే సరిచూసుకొని, వచ్చే సమావేశంలో తెలపాలన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Similar News

News March 28, 2026

‘అమరావతి’పై నేడు ప్రత్యేకంగా అసెంబ్లీ.. వైసీపీ హాజరుపై సందిగ్ధత

image

AP: రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై అసెంబ్లీ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఈ మేరకు విభజన చట్టంలో సవరణ చేయాలని కోరుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది. CM చంద్రబాబు, Dy.CM పవన్‌తోపాటు దాదాపు 20 మంది MLAలు ప్రసంగించనున్నారు. ఈ సమావేశానికి వైసీపీ MLAల హాజరుపై ఇప్పటికీ స్పష్టత లేదు. చట్టబద్ధతపై మండలిలోనూ చర్చించాలని ఆ పార్టీ నేత సజ్జల ఇటీవల డిమాండ్ చేశారు.

News March 28, 2026

పొలాసలో 4.8.. రాయికల్ 0.5 మిల్లీమీటర్ల వర్షం

image

జగిత్యాల జిల్లాలో శుక్రవారం, శనివారం ఉదయం ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు కురిశాయి. పలుచోట్ల తేలికపాటి వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. పొలాసలో 4.8 మిల్లీమీటర్లు, రాయికల్ 0.5, ఎండపల్లిలో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తదితర ప్రాంతాల్లో అత్యంత తేలికపాటి జల్లులు కురిశాయి. కాగా పంటలు చేతికి వచ్చే సమయంలో ఈ అకాల వర్షాలతో తీవ్ర నష్టం అవకాశం ఉండటంతో మామిడి, వరి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News March 28, 2026

విజయనగరం, మన్యం జిల్లాలకు వడగాల్పుల అలర్ట్

image

ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో శనివారం తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని AP విపత్తు నిర్వహణ సంస్థ MD కన్నబాబు ప్రఖర్ తెలిపారు. విజయనగరం జిల్లాలో బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, గుర్ల, మెరకముడిదాం, రాజాం, రేగిడి ఆముదాలవలస, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాలు, మన్యం జిల్లాలోని బలిజిపేట, గరుగుబిల్లి, పాలకొండ, సాలూరు, సీతానగరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.