News August 21, 2025
ప్రజల ఆశీర్వాదమే ప్రభుత్వానికి బలం: మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి, సంక్షేమ పథకాల అమలుకు ప్రజలే ఆధారం అని, వారి ఆశీర్వాదాలే ఇందిరమ్మ ప్రభుత్వానికి బలం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. తిరుమలాయపాలెం మండలంలో గురువారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఎనిమిదో తరగతి చదువుతున్న 91 మంది బాలికలకు సైకిళ్లు పంపిణీ చేసి, మాట్లాడారు.
Similar News
News March 21, 2026
కృష్ణా: నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న క్రికెట్ బెట్టింగ్

గన్నవరంలో క్రికెట్ బెట్టింగ్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బెట్టింగ్‌లో భారీగా నష్టపోయిన నాగరాజు (ఫైల్ ఫొటో) అనే వ్యక్తి, చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురయ్యాడు. అప్పులవారు ఒత్తిడి చేయడంతో తట్టుకోలేక 2 రోజుల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం మరణించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 21, 2026
ప్రతి 45 రోజులకు ఒక కొత్త ఎయిర్‌పోర్ట్: రామ్మోహన్

దేశంలో ప్రతి 45 రోజులకు ఒక ఎయిర్‌పోర్ట్ ప్రారంభిస్తున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్ అన్నారు. విశాఖలో ఓ ప్రోగ్రామ్‌లో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే IND అత్యంత సురక్షితమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్‌గా అవతరించిందని చెప్పారు. APలోని, TGలోని పలు కొత్త విమానాశ్రయాల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. NDA అధికారంలోకి వచ్చేనాటికి తక్కువగా ఉన్న ఎయిర్‌పోర్టుల సంఖ్య 167కి చేరిందని చెప్పారు.
News March 21, 2026
TTD ఆలయాల ఆధునీకరణకు CM దిశానిర్దేశం

CM చంద్రబాబు సూచనలతో టీటీడీ ఆలయాలను ఆధునాతన ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. AI ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సమీక్షించిన సీఎం, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సేవలను మెరుగుపరచాలన్నారు. లడ్డూ తయారీ, అన్నదానం, ప్రాణదానం సేవలను నిర్వహించాలని పేర్కొన్నారు. అలాగే సేవకులకు శిక్షణ ఇచ్చి అన్ని ఆలయాల్లో సేవలను విస్తరించాలని CM సూచించారు.


