News August 21, 2025

HYDలో SMART మీటర్ వాల్వ్‌లు వస్తున్నాయి!

image

జలమండలి పరిధిలో దాదాపుగా 5,000 వరకు గృహాలకు సరఫరా చేసేందుకు మెయిన్ వాల్వ్‌లు ఉన్నాయి. వీటిలో మొదట 1000 వాల్వ్‌లను స్మార్ట్ వాల్వ్‌లుగా మార్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. స్మార్ట్ ఆటోమేటిక్ వాల్వ్‌లతో నిర్ణీత సమయంలో నీటిని సరఫరా చేయడం, నాణ్యత గుర్తించడం, ఇతర సమస్యలకు చెక్ పెట్టొచ్చనే నేపథ్యంలో వాటిపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News August 21, 2025

HYD: తాను చనిపోతూ ఏడుగురికి పునర్జన్మ

image

తాను చనిపోతూ ఏడుగురికి ప్రాణాలు పోశాడు. మియాపూర్‌కు చెందిన కృష్ణ సుమంత్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. AUG 18న విధులు ముగించుకొని ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురై, ఆస్పత్రిలో చేరాడు. బుధవారం బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు తెలిపారు. జీవన్‌దాన్ వారు కృష్ణ తండ్రితో మాట్లాడి గుండె, కిడ్నీలు, లివర్, లంగ్స్, కళ్లు దానం చేయమన్నారు. అవయవదానం చేసి కృష్ణ ఏడుగురికి పునర్జన్మ ఇచ్చాడు.

News August 21, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం EC కసరత్తు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం EC కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేక సమ్మరీ రివిజన్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది. కొత్త ఓటర్ల నమోదు, మార్పు చేర్పులకు అవకాశం ఇచ్చింది. సెప్టెంబర్ 2 నుంచి 17 వరకు అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. 25 లోపు అభ్యంతరాలను పరిష్కరించాలని స్పష్టం చేసింది. సెప్టెంబర్‌ 30న తుది జాబితా విడుదల కానుంది. జులై 1 నాటికి 18 ఏళ్లు నిండినవారు ఓటురు నమోదు చేసుకోవచ్చు.
SHARE IT

News August 21, 2025

హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిర్వహణకు కొత్త మార్పు

image

హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణకు కొత్త మార్పులు వచ్చాయి. హైదరాబాద్ పోలీసులు, HCSCతో కలిసి 50 ట్రాఫిక్ పెట్రోలింగ్ బైక్‌లు, 100 మంది ట్రాఫిక్ మార్షల్స్‌ను ప్రారంభించారు. ఇందులో భారతదేశంలో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్లను కూడా నియమించారు. ఈ మార్షల్స్ పోలీసులకు సహకరిస్తారు. ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడానికి ఈ చర్యలు తీసుకున్నారు.