News August 21, 2025

NDAకు మద్దతు ఇస్తున్నాం: బొత్స

image

AP: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్థికి YCP మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. నంబర్ గేమ్ ఉండొద్దనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, పార్టీ పెట్టినప్పటి నుంచి ఇదే విధానం అమలు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి తాము మద్దతిచ్చినట్లు బొత్స గుర్తుచేశారు. తమది కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ అని ఆయన వివరించారు.

Similar News

News August 21, 2025

రేపు ఫలితాలు విడుదల

image

AP: రేపు DSC మెరిట్ <<17459141>>లిస్ట్ <<>>విడుదల చేయనున్నట్లు కన్వీనర్ కృష్ణారెడ్డి వెల్లడించారు. DSC సైటుతో పాటు జిల్లా విద్యాధికారి సైటులోనూ ఫలితాలు చూసుకోవచ్చన్నారు. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లో వివిధ కేటగిరీల పోస్టుల కాల్ లెటర్ పొందవచ్చని సూచించారు. లిస్టులో ఉన్న వారంతా ఒరిజినల్ సర్టిఫికెట్లు, గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన 3 సెట్ల జిరాక్సులు, 5 పాస్ పోర్టు ఫొటోలతో వెరిఫికేషన్‌కు హాజరుకావాలని తెలిపారు.

News August 21, 2025

వలపు వల.. వృద్ధుడు విలవిల

image

TG: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో HYD అమీర్‌పేటకు చెందిన ఓ వృద్ధుడు(81) చిక్కుకున్నాడు. మాయ రాజ్‌పుత్ అనే మహిళ పేరిట అతడికి జూన్ మొదటివారంలో స్కామర్స్ వాట్సాప్ కాల్ చేశారు. చనువుగా మాట్లాడుతూ ట్రాప్ చేసి ఆస్పత్రి ఖర్చులు, ప్లాట్ రిజిస్ట్రేషన్, బంగారు ఆభరణాలు విడిపించడం కోసమంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ద్వారా రూ.7.11 లక్షలు కాజేశారు. ఇంకా డబ్బులు డిమాండ్ చేయడంతో అనుమానించిన వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు.

News August 21, 2025

APLలో హేమంత్ విధ్వంసం

image

ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌-2025లో భీమవరం బుల్స్ కెప్టెన్ హేమంత్ రెడ్డి బ్యాటింగ్, బౌలింగ్‌తో అదరగొట్టారు. విజయవాడ సన్‌షైనర్స్‌తో మ్యాచ్‌లో కేవలం 43 బంతుల్లోనే 6 సిక్సులు, 3 ఫోర్లు బాది 71* రన్స్ చేశారు. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసి, కేవలం 19 పరుగులే ఇచ్చారు. 161 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భీమవరం బుల్స్.. హేమంత్, హిమకర్(43) చెలరేగడంతో 6 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.