News August 21, 2025

మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠిద్దాం: JC

image

పర్యావరణం పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్నారు. DYFI ఆధ్వర్యంలో ‘మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం’ అనే పోస్టర్‌ను గురువారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు.

Similar News

News August 21, 2025

పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం: కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి

image

సహజ రంగులతో తయారు చేసిన మట్టి గణేష్ విగ్రహాలను వాడి వాటిని ప్రోత్సహించాలని, పర్యావరణ పరిరక్షణకు మన వంతు బాధ్యతగా చేయూతను అందిద్దామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. వినాయక చవితి విశిష్ట తను కాపాడేందుకు మనమందరం సమిష్ఠిగా కృషిచేయడం వల్ల ఒక గొప్ప మార్పును సాధించవచ్చన్నారు. సహజ రంగులతో మట్టి విగ్రహాలను తయారు చేయడం స్వచ్ఛతకు చిహ్నమన్నారు.

News August 21, 2025

కడప: ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

image

కడపలో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రవేశాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు ఆగస్టు 26 వరకు ఉందని ప్రన్సిపల్ రత్నరాజు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈనెల 26న సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 8555958200 నంబర్‌కు సంప్రదించవచ్చని సూచించారు.

News August 21, 2025

కడప జిల్లాలో 81 మంది MPEOలు బదిలీ

image

కడప జిల్లా వ్యవసాయ శాఖలో పనిచేసే 81 మంది మల్టీ పర్పస్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ (MPEO)లను బదిలీ చేశారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్రనాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని పని సర్దుబాటు కోసం బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరిలో కొందరిని ఒక మండలం నుంచి మరొక మండలానికి, మరి కొందరిని ఒక డివిజన్ నుంచి వేరే డివిజన్ కు బదిలీ చేశారు. వీరు గ్రామాల్లో రైతులకు సహాయంగా RSKల్లో ఉంటారు.